breaking news
channel 4
-
డయానా శృంగార జీవిత రహస్యాలు వెలుగులోకి!
లండన్: ప్రిన్సెస్ డయానాకు చెందిన ప్రైవేట్ టేపులను విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది. రాయల్ కుటుంబం వద్దని వారిస్తున్నా లెక్కచేయకుండా బ్రిటన్‌కు చెందిన బ్రాడ్ కాస్టర్ చానెల్ 4 ఆదివారం వాటిని బహిర్గతం చేయనుంది. టీవీ డాక్యుమెంటరీ రూపంలో ఉన్న ఈ ప్రైవేట్ టేపుల్లో డయానా వ్యక్తిగత లైంగిక జీవితం, వివాహం తర్వాత ప్రిన్స్ చార్లెస్ పట్ల ఉన్న అసంతృప్తి వంటి తదితరమైన అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం రాయల్ కుటుంబం ఆలోచనలో పడింది. అనుమానాస్పదస్థితిలో ప్రిన్సెస్ డయానా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, అంతకుముందే తన భర్త ప్రిన్స్ చార్లెస్‌తో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉండేది. లైంగిక జీవితం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందంటూ పలుమార్లు ఆమె చెప్పినట్లు కథనాలు వచ్చాయి. అయితే, పలుటీవీ చానెల్లు రేడియో సంస్థలు ఆమె బతికున్న రోజుల్లో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. వాటిల్లో కొన్ని ఇప్పటికే బయటకు రాగా ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. వచ్చే నెలలో డయానా వర్థంతి నేపథ్యంలో ఆమె శృంగార జీవితానికి సంబంధించిన రహస్యాలను చానెల్ 4 విడుదల చేయనుంది. అయితే, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ టేపుల్లో చార్లెస్‌కు డయానాకు మధ్య ఏడేళ్లపాటు శృంగార జీవితం లేదని విషయం కూడా ఉండనుందని తెలుస్తోంది. హ్యారీ జన్మించిన తర్వాత వారిద్దరి మధ్య దూరం ఎలా పెరిగిందనే విషయాలు, ఆ తర్వాత ఒకరిపట్ల ఒకరు విద్వేషంగా ఎలా మారారనే విషయాలు కూడా ఇందులో తెలియనున్నాయట. అయితే, వీటిని బహిర్గతం చేయొద్దంటూ ఇప్పటికే రాయల్ కుటుంబంతోపాటు డయానా కుటుంబ సభ్యులు, స్నేహితులు, మాజీ అధికారులు చెబుతున్నప్పటికీ వాటిని విడుదల చేసేందుకు సదరు టీవీ చానెల్ సిద్ధమైంది. -
ఆ టీవీలో వికృతపర్వం మళ్లీ మొదలు..
లండన్: ప్రఖ్యాత బ్రిటిష్ టీవీ.. చానెల్ 4లో వికృతపర్వం మళ్లీ మొదలైంది. ఇప్పటివరకు టీవీల్లో ప్రసారమైనవాటిలో అత్యంత చెత్త కార్యక్రమంగా విమర్శలపాలైన ‘నేకెడ్ అట్రాక్షన్’ రెండో సిరీస్‌ను చానెల్4 గురువారం అధికారికంగా ప్రసారం చేసింది. డేటింగ్ షోగా అభివర్ణించే ఈ కార్యక్రమంలో పోటీదారులను స్టేజ్‌పై నగ్నంగా నిలబెట్టించి పలురకాల ప్రశ్నలు వేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ తర్వాత జంట డేటింగ్ చేయడం, వారి అనుభవాల వివరణ తంతును ఎపిసొడ్లుగా విభజించి ప్రసారం చేస్తారు. చానెల్ 4లో గత ఏడాది జులై 25న నేకెడ్ అట్రాక్షన్ మొదటి సిరీస్ ప్రారంభమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, ఇండిపెండెంట్ బ్రాడ్‌కాస్టింగ్ అథారిటీ కలిగి ఉన్నందున టీవీ ప్రసారల నిలిపివేత సాధ్యంకాలేదు. ఆ విధంగా చానెల్ 4 తన హక్కులను మరోసారి దుర్వినియోగం చేస్తూ వికృత ప్రసారాలను పునఃప్రారంభించింది. జర్నలిస్ట్, రచయిత్రి అన్నా రిచర్డ్సన్ ఈ ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేస్తున్నారు. కాగా, గతంలో ఘాటుగా స్పందించిన నెటిజన్లు ఈ డేటింగ్ షో రెండో సిరీస్‌పై భిన్నంగా కామెంట్లు చేయడం గమనార్హం.