వైఎస్ఆర్సీపీలో చేరిన కాంగ్రెస్ నేతలు | congress leaders from kurnool join ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీలో చేరిన కాంగ్రెస్ నేతలు

Apr 22 2015 5:31 PM | Updated on Mar 18 2019 8:51 PM

కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకుడు చెరుకులపాటి నారాయణరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కర్నూలు జిల్లా కాంగ్రెస్ నాయకుడు చెరుకులపాటి నారాయణరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

2009లో జరిగిన ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి నారాయణరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు నారాయణరెడ్డితో పాటు డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఒకరు, పలువురు డైరెక్టర్లు, 10 మంది సర్పంచులు, పలువురు ఎంపీటీసీ సభ్యులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement