కండోమ్స్‌లో కొకైన్ నింపి మింగేశాడు !! | cocaine smuggling through condoms in bangalore airport one arrested | Sakshi
Sakshi News home page

కండోమ్స్‌లో కొకైన్ నింపి మింగేశాడు !!

Feb 9 2016 8:24 PM | Updated on Sep 3 2017 5:17 PM

అక్రమంగా డబ్బు సంపాదించడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొకైన్ స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు.

బెంగళూరు: అక్రమంగా డబ్బు సంపాదించడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొకైన్ స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు. సినిమాల్లో చేసే స్మగ్లింగ్కు ఏ మాత్రం తీసిపోకుండా నిజ జీవితంలో కొకైన్ స్మగ్లింగ్ చేస్తున్నారు.

తాజాగా కొకైన్ నింపిన కండోమ్స్‌ను మింగి స్మగ్లింగ్ చేయటానికి యత్నించిన వ్యక్తిని మంగళవారం బెంగళూరు విమానాశ్రయం అధికారులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన ఇరోన్‌శ్యామురన్ పర్యాటక ముసుగులో కండోమ్స్‌లో కొకైన్ నింపుకుని వాటిని మింగేశాడు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న అధికారులు కెంపేగౌడ విమానాశ్రయంలో అతడు దిగిన వెంటనే అరెస్ట్ చేసి విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు విరోచన మందులు ఇచ్చి కొకైన్ క్యాప్సుల్‌ను బయటకు తీశారు. కొకైన్ విలువ రూ. 3.71 లక్షలు ఉంటుంటుందని తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement