ఈ ఏడాది సిస్కో 170 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు | Cisco has invested more than $ 170 million this year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది సిస్కో 170 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు

Jun 19 2015 2:47 AM | Updated on Apr 4 2019 3:21 PM

ఈ ఏడాది సిస్కో 170 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు - Sakshi

ఈ ఏడాది సిస్కో 170 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు

అమెరికా టెక్నాలజీ దిగ్గజం సిస్కో ఈ ఏడాది భారత్‌లో 174 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడుతోంది.

న్యూఢిల్లీ : అమెరికా టెక్నాలజీ దిగ్గజం సిస్కో ఈ ఏడాది భారత్‌లో 174 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడుతోంది. తయారీ రంగంపై దృష్టి సారిస్తున్నామని సిస్కో సిస్టమ్స్ చైర్మన్, సీఈఓ జాన్ టి. చాంబర్స్ చెప్పారు. గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిశామని, డిజిటల్  ఇండియా  కార్యక్రమం కింద తాము నిర్వహించబోయే పాత్రను ఆయనకు వివరించామని తెలిపారు.

ప్రతీ ఏడాది భారత్‌లో 170 కోట్ల డాలర్లు పెడుతున్నామని వివరించారు. ఈ ఏడాది అదనంగా 6 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నామని పేర్కొన్నారు. వీటిల్లో విద్యార్ధుల శిక్షణ కోసం 2 కోట్ల డాలర్లు, శిక్షణ కేంద్రాల విస్తరణకు 4 కోట్ల డాలర్లు వినియోగిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement