వాయవ్య చైనాలోని సిన్ జియాంగ్ మారుమూల ప్రాంతాన్ని భారీ భూకంపం కుదిపేసింది.
చైనాలో భూకంపం, 7.3 గా నమోదు!
Feb 12 2014 4:59 PM | Updated on Aug 13 2018 3:53 PM
వాయవ్య చైనాలోని సిన్ జియాంగ్ మారుమూల ప్రాంతాన్ని భారీ భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.3 గా నమోదైంది. స్థానిక కాలమానం 5.19 నిమిషాలకు భూకంపం సంభవించినట్టు చైనా ఎర్త్ క్వేక్ నెట్ వర్క్ సెంటర్ అధికారుల సమాచారం.
నైరుతి సిన్ జియాంగ్ ప్రాంతంలోని యుతియాన్ కు 12 కిలో మీటర్ల రూదరంలో భూకంప తీవ్రతను కొలిచారు. ఇదే ప్రాంతంలో 5 గంటల 24 నిమిషాలకు మరోసారి భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు.
Advertisement
Advertisement