
ఒకే వేదికపై చినజీయర్, కేసీఆర్, వెంకయ్య
త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి షష్టిపూర్తి వేడుకలు ఆదివారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. త్రిదండి చిన జీయర్ స్వామి అక్టోబర్ 31 నాటికి 60 ఏండ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారం రోజులుగా స్వామివారి షష్టిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.



