breaking news
tridandi chinajiyar
-
'చీర్ అప్ భారత్' పోస్టర్ ఆవిష్కరించిన చిన్న జీయర్ స్వామి
హైదరాబాద్ : ఈనాటి సమాజంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా వారి వారి పనుల ఒత్తిడి వల్ల మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతూ సంతోషకరమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు. కేవలం కళల ద్వారానే ఈ పరిస్థితి నుంచి బయటపడటం సాధ్యమవుతుందని భావించి సిరిమువ్వ ఆర్ట్స్ బృందం వారు 'చీర్ అప్ భారత్(invoking inner happiness)' అనే ఒక కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిరిమువ్వ ఆర్ట్స్ వారు 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయస్సు గల వారికి ఉచితంగా నృత్యకళలో శిక్షణ ఇచ్చి వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించి వారికి మెగా డాన్స్ షో ద్వారా కొన్ని వేల మంది ప్రేక్షకుల ముందు నృత్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఐదు సీజన్ల పాటు విజయవంతంగా సాగిన ఈ కార్యక్రమం ఆరో సీజన్లో భాగంగా ఈ రోజు చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా 'చీర్ అప్ భారత్' లోగోను వారి ఆశ్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ మాట్లాడుతూ ఒక మనిషిలోని సంతోషాన్ని బయటకి తీసుకురావడం సాధారణంగా జరిగే పని కాదు కానీ ఒక కళ ద్వారా మాత్రమే ఆ సంతోషాన్ని బయటకు తీసుకురాగలం అన్నారు. ఈ మంచి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మనసారా కోరుకుంటూ ఈ లోగోను నా చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నందుకు సంతోషంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిమువ్వ ఆర్ట్స్ డైరెక్టర్స్ వై. మధుసూదన్ రావు, వై. తులసి, ప్రముఖ అంతర్జాతీయ మెజీషియన్ సామల వేణు, హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, డాన్స్ మాస్టర్ ధావన్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఎస్వీ గోసంరక్షణశాలలో వైభవోపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు -
చినజీయర్ షష్టిపూర్తి వేడుకలు
-
ఒకే వేదికపై చినజీయర్, కేసీఆర్, వెంకయ్య
హైదరాబాద్: త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి షష్టిపూర్తి వేడుకలు ఆదివారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. త్రిదండి చిన జీయర్ స్వామి అక్టోబర్ 31 నాటికి 60 ఏండ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారం రోజులుగా స్వామివారి షష్టిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)