ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోరాడాలని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీమంత్రి విజయరామరాజు చెప్పారు.
పార్వతీపురం (విజయనగరం జిల్లా): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోరాడాలని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీమంత్రి విజయరామరాజు చెప్పారు.
సోమవారం ఇక్కడికొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై చంద్రబాబునాయుడు మెతకవైఖరి అవలంభిస్తున్నారని, దీనివల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందన్నారు. అందుకే చంద్రబాబు మౌనం వీడి కేంద్రంతో పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.