బాబు అసమర్థత వల్లే ఈ దుస్థితి | Chandra babu's inefficiency lead this situation, say Speakers | Sakshi
Sakshi News home page

బాబు అసమర్థత వల్లే ఈ దుస్థితి

Aug 29 2013 3:58 AM | Updated on Sep 1 2017 10:12 PM

బాబు అసమర్థత వల్లే ఈ దుస్థితి

బాబు అసమర్థత వల్లే ఈ దుస్థితి

మంత్రి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను స్థాపించి తెలంగాణవాదాన్ని తీసుకువచ్చారని, చంద్రబాబు అసమర్థతవల్లే వేర్పాటువాదం ఉద్యమం తీవ్రమైందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

సాక్షి, అనంతపురం : మంత్రి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను స్థాపించి తెలంగాణవాదాన్ని తీసుకువచ్చారని, చంద్రబాబు అసమర్థతవల్లే వేర్పాటువాదం ఉద్యమం తీవ్రమైందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సాక్షి పత్రిక, టీవీ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురంలోని రెవెన్యూ కమ్యూనిటీ హాలులో ‘ఎవరెటు?’ పేరుతో చైతన్యపథం సదస్సు నిర్వహించారు. విద్యార్థులు, మేధావులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఏపీఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజ్ మాట్లాడుతూ సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, స్వార్థ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందన్నారు.
 
 జేఏన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొ. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే అనంతపురం జిల్లా ఎడారిగా మారుతుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విభజనలో హైదరాబాద్‌ను కోల్పోతే ఆస్తులు తెలంగాణ వారికి, అప్పులు సీమాంధ్రులకు మిగులుతాయని వివరించారు. 60 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ శ్రమను హైదరాబాద్ అభివ ృద్ధికి వెచ్చించారని న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ విశ్వనాథరెడ్డి, సెంటిమెంటు పేరిట రాష్ట్రాన్ని విడగొట్టడం దుర దృష్టకరమని ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ నరసింహులు పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బలమైన నాయకత్వం లేకపోవడంవల్లే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement