ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం తిరుపతి కాంగ్రెస్ పోరుసభలో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. యువత ఎలాంటి ఉద్రేకాలకూలోను కావద్దని చంద్రబాబు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోరుసభలో కోటి అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు వేలూరు సీఎంసీకి తరలించారు.