సీబీఎస్ఈ సిలబస్‌లో పదకొండు, పన్నెండో తరగతుల విద్యార్థులకు యోగాను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం.
న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ సిలబస్‌లో పదకొండు, పన్నెండో తరగతుల విద్యార్థులకు యోగాను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు కూడా వారంలో రెండుసార్లు యోగా తరగతులుంటాయని.
రాజ్యసభకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయుష్ మంత్రి శ్రీపాద యశోనాయక్ తెలిపారు. దీని గురించి దేశవ్యాప్తంగా ఉన్న 15,962 సీబీఎస్ఈ పాఠశాలలకు సమాచారం ఇచ్చామని వెల్లడించారు.