breaking news
Shripad Yasso Naik
-
సీబీఎస్ఈ విద్యార్థులకు యోగా తప్పనిసరి
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ సిలబస్‌లో పదకొండు, పన్నెండో తరగతుల విద్యార్థులకు యోగాను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు కూడా వారంలో రెండుసార్లు యోగా తరగతులుంటాయని. రాజ్యసభకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయుష్ మంత్రి శ్రీపాద యశోనాయక్ తెలిపారు. దీని గురించి దేశవ్యాప్తంగా ఉన్న 15,962 సీబీఎస్ఈ పాఠశాలలకు సమాచారం ఇచ్చామని వెల్లడించారు. -
ఏపీ, తెలంగాణలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి: యశోనాయక్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణల్లో పలు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ తెలిపారు. 2014-15లో అభివృద్ధి చేసే ఈ కేంద్రాల వివరాలను బుధవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా అందచేశారు. మెగా సర్య్యూట్ కింద కొండపల్లి-ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు, సర్క్యూట్ కింద గుంటూరు జిల్లాలోని గుత్తికొండ బిలం గుహలు-పిడుగురాళ్ల-కొండవీడు ఖిల్లా-కోటప్పకొండ దేవాలయం, శ్రీకాకుళంలోని బుద్ధిస్ట్ సర్క్యూట్‌తో పాటు, పర్యాటక గమ్యస్థానాల కింద నాగార్జునసాగర్ అభివృద్ధి, శ్రీకాళహస్తిలో సౌండ్ అండ్ లైట్ షో, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలం బీచ్‌ను అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. పర్యాటక మంత్రిత్వశాఖ గుర్తించిన ప్రాజెక్టుల్లో సర్క్యూట్-1లో విశాఖపట్నం-విజయనగరం-శ్రీకాకుళం, సర్క్యూట్-2లో హైదరాబాద్-నల్లగొండ-వరంగల్-కరీంనగర్-ఆదిలాబాద్, సర్క్యూట్-3లో తూర్పుగోదావరి-ఖమ్మం-పశ్చిమ గోదావరి-కృష్ణ-గుంటూరు, సర్క్యూట్-4లో చిత్తూరు-నెల్లూరు-అనంతపురం-కడప జిల్లాలు ఉన్నట్టు తెలిపారు.