ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు! | Bomb threat at Delhi-Bengaluru airports declared hoax | Sakshi
Sakshi News home page

ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు!

Sep 5 2015 9:39 AM | Updated on Sep 3 2017 8:48 AM

ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు!

ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు!

విమానాల్లో బాంబులు పెట్టామంటూ వరుసగా వస్తున్న బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి.

ఢిల్లీ: విమానాల్లో బాంబులు పెట్టామంటూ వరుసగా వస్తున్న బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా పలు విమానాల్లో బాంబులు పెట్టామంటూ ఢిల్లీకి, బెంగళూరు నగరాల్లోని ఎయిర్ పోర్ట్ లకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆరు విమానాల్లో బాంబులు పెట్టామని దుండగుల నుంచి  శనివారం ఉదయం బెదిరింపు ఫోన్స్ కాల్స్ వచ్చాయి.

 

దీంత్ అప్రమత్తమై భద్రతా బలగాలు విమానాలను క్షణ్ణంగా తనిఖీ చేశారు. మూడు అంతర్జాతీయ విమానాలకు ఇందిరా గాంధీ విమానాశ్రయానికి తిరిగి రప్పించి తనిఖీలు నిర్వహించారు. అనంతరం విమానాల్లో ఎటువంటి బాంబులు లేవని నిర్ధారించారు. ఇది కొంతమంది ఆకతాయిలు చేసిన పనిగా అనుమానిస్తున్నా.. ఈ కాల్స్ పై పూర్తి  స్థాయి విచారణ చేపట్టేందుకు పోలీసులు సన్నద్దమయ్యారు. అసలు బెదిరింపు కాల్స్ వెనుక ఉగ్రవాదులు కుట్ర ఏమైనా ఉందా?అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement