దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ | BMW sales soar in second quarter | Sakshi
Sakshi News home page

దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ

Aug 3 2016 1:56 PM | Updated on Apr 3 2019 4:59 PM

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీసంస్థ బీఎండబ్ల్యూ గ్రూపు రెండో త్రైమాసికంలో భళా అనిపించింది.

మ్యూనిచ్ : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీసంస్థ బీఎండబ్ల్యూ గ్రూపు రెండో త్రైమాసికంలో భళా అనిపించింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో అమ్మకాల వాల్యుమ్, నికరలాభాల్లో బెస్ట్ క్వార్టర్గా నిలిచింది. మంగళవారం ప్రకటించిన బీఎండబ్ల్యూ రెండో త్రైమాసిక ఫలితాల్లో ఈ గ్రూపు అమ్మకాల వాల్యుమ్ 5.7 శాతం ఎగిసి, 6,05,534 యూనిట్లగా నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది. సగం ఏడాదిలో విక్రయాలు గరిష్ట స్థాయికి చేరుకుని, 11,63,139 యూనిట్లను విక్రయించినట్టు వెల్లడించింది. యేటికేటికీ ఈ వృద్ధి 5.8 శాతమని జిన్హువా వార్తా ఏజెన్సీ రిపోర్టులో తెలిపింది.

రెవెన్యూ సైతం 4.5 శాతం పెరిగి, 28 బిలియన్ డాలర్లుగా నమోదుచేసింది. ఆరు నెలల రెవెన్యూ 2.3 శాతం ఎగిసి, 46 బిలియన్ యూరోలుగా రికార్డుచేసింది. ముందటి కంటే ఈ త్రైమాసికంలో ఎక్కువకార్లను విక్రయించి, రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించామని బోర్డు మేనేజ్మెంట్ చైర్మన్ హెర్లాడ్ క్రుగేర్ తెలిపారు. లాభాల వృద్ధిని పెంచుకోవడంతో పాటు తమ ప్రణాళికలను స్టెప్ బై స్టెప్ అమలుచేస్తామని ఆయన ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement