
దేశాన్ని అమ్మేసేందుకు బీజేపీ కుట్ర: మమత
పార్లమెంట్ లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలు కలిసికట్టుగా ఉండాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.
కోల్ కతా: పార్లమెంట్ లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలు కలిసికట్టుగా ఉండాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నందునే తమను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి తామే ప్రధాన ప్రత్యర్థులమని తెలుసునని, అందుకే తమను టార్గెట్ చేశారని అన్నారు.
తమను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. మంగళవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో మమత మాట్లాడారు. దేశ ప్రజలను బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. దేశాన్ని అమ్మేసేందుకు కేంద్రపాలకులు ప్రయత్నిస్తున్నారని దీదీ ధ్వజమెత్తారు. బెంగాల్ లో తృణమూల్ పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు.