నోట్ల రద్దు: బీజేపీలోని బ్రహ్మచారుల వల్లే! | BJP Has Many Bachelors | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు: బీజేపీలోని బ్రహ్మచారుల వల్లే!

Nov 18 2016 12:25 PM | Updated on Mar 29 2019 9:31 PM

నోట్ల రద్దు: బీజేపీలోని బ్రహ్మచారుల వల్లే! - Sakshi

నోట్ల రద్దు: బీజేపీలోని బ్రహ్మచారుల వల్లే!

పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని అనేక కుటుంబాలు కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని అనేక కుటుంబాలు కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల పెద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వివాహాలు జరుపుతున్న కుటుంబాలు ఒకేసారి రూ. 2.5 లక్షల వరకు బ్యాంకుల నుంచి తీసుకోవచ్చునని ప్రకటించాయి.
 
అయితే, పెళ్లిళ్ల సీజన్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం బీజేపీలోని బ్రహ్మచారులేనంటూ యోగా గురువు బాబా రాందేవ్‌ ఛలోక్తులు విసిరారు. ‘బీజేపీలో చాలామంది బ్రహ్మచారులే. అందుకే వారికి ఇది పెళ్లిళ్ల సీజన్‌ అని తెలియలేదు. అది వారి పొరపాటు’ అంటు జోక్‌ చేశారు. ‘15 లేదా నెలరోజుల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉంటే పెళ్లిళ్లు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవి కావు. ఈ నిర్ణయం వల్ల ఒక మంచి కూడా జరిగింది. చాలామంది కట్నం అడగటం లేదు’ అని నవ్వుతూ పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement