కేంద్రమంత్రిపై రాళ్లతో దాడి, గాయాలు

కేంద్రమంత్రిపై రాళ్లతో దాడి, గాయాలు


కోల్కతా: ప్రముఖ నటుడు, గాయకుడు, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కాన్వాయ్పై తృణమాల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సుప్రియోతో పాటు ఆయన అనుచరులు ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఓ రాయి తన ఛాతీపై పడిందని, గాయమైందని మంత్రి చెప్పారు. బుధవారం పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.పశ్చిమబెంగాల్ న్యాయశాఖ మంత్రి మలోయ్ ఘటక్ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారని సుప్రియో ఆరోపించారు. ఆందోళనకారులు దాడి చేస్తున్నా పోలీసులు ఆపే ప్రయత్నం చేయలేదని చెప్పారు. నిరసనకారుల గుంపులోంచి ఓ పెద్ద రాయి విసిరారని సుప్రియో తెలిపారు. కొందరు ఈ ఘటనను వీడియో తీశారని పేర్కొన్నారు. ఆందోళనకారులు మంత్రి కారును ధ్వంసం చేశారు. అక్రమంగా కబేళాలను నడుపుతున్నారని, పరిశీలించేందుకు వెళ్లగా దాడిచేసినట్టు తెలిపారు. సుప్రియో అసన్సోల్ నియోజకవర్గం నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top