breaking news
attacked with stone
-
మహిళ కాదని హత్య..!
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: మహిళ వేషధారణలో ఉన్న ఓ ట్రాన్స్‌జెండర్‌ను శృంగారం కోసం తీసుకువెళ్లిన వ్యక్తి..మహిళ కాదని గుర్తించి బండరాయితో తలపై బాది హత్య చేశాడు. ఈ కేసును జడ్చర్ల పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రెమా రాజేశ్వరి బుధవారం వెల్లడించారు. ఫిబ్రవరి 11న బూరెడ్డిపల్లి జాతీయ రహదారి సమీపంలో ట్రాన్స్‌జెండర్ మండ అర్జున్ అలియాస్ చంద్రిక(35) హత్య చేసిన ఘటనలో జడ్చర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. వీపనగండ్ల మండలం తుముకుంటకి చెందిన మండ అర్జున్ రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో నివాసం ఉంటున్నాడు. అయితే మండ అర్జున్ మహిళ వేశాధారణలో ఉంటూ శంషాబాద్, షాద్‌నగర్ జాతీయ రహదారిపై వ్యభిచారం చేస్తున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాకు చెందిన భరత్ లాల్‌రాయ్ మచారంలో నివాసం ఉంటూ పోలేపల్లి సెజ్‌లోని ఓ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 10న భూత్పూర్ సమీపంలో మృతుడు మండ అర్జున్ అలియాస్ చంద్రిక టాప్ లెగిన్ ఫ్యాంట్, ముఖానికి స్కార్ప్ కట్టుకొని రోడ్డుపై నిలబడి ఉన్నాడు. అయితే నిందితుడు భరత్‌లాల్ రాయ్ వ్యభిచారం కోసం మండ అర్జున్ రూ.400లు ఇస్తానని మాట్లాడుకొని భూరెడ్డిపల్లి సమీపంలోకి తీసుకువెళ్లాడు. అక్కడి వెళ్లిన తర్వాత మహిళ కాదని గుర్తించి బండరాయితో మండ అర్జున్ తలపై మోది హత్య చేశాడు. ఆతర్వాత మృతుడి దగ్గర ఉన్న రూ.25 వేల సెల్‌ఫోన్, రూ.400నగదు తీసుకొని అక్కడి నుంచి పరారయినట్లు తెలిపారు. ఈ కేసులో 60మంది ట్రాన్స్జెండర్లను ప్రశ్నించి అత్యంత సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించి నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఎస్పీ రివార్డులతో సత్కరించారు. -
కేంద్రమంత్రిపై రాళ్లతో దాడి, గాయాలు
-
కేంద్రమంత్రిపై రాళ్లతో దాడి, గాయాలు
కోల్‌కతా: ప్రముఖ నటుడు, గాయకుడు, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కాన్వాయ్‌పై తృణమాల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సుప్రియోతో పాటు ఆయన అనుచరులు ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఓ రాయి తన ఛాతీపై పడిందని, గాయమైందని మంత్రి చెప్పారు. బుధవారం పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పశ్చిమబెంగాల్ న్యాయశాఖ మంత్రి మలోయ్ ఘటక్ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారని సుప్రియో ఆరోపించారు. ఆందోళనకారులు దాడి చేస్తున్నా పోలీసులు ఆపే ప్రయత్నం చేయలేదని చెప్పారు. నిరసనకారుల గుంపులోంచి ఓ పెద్ద రాయి విసిరారని సుప్రియో తెలిపారు. కొందరు ఈ ఘటనను వీడియో తీశారని పేర్కొన్నారు. ఆందోళనకారులు మంత్రి కారును ధ్వంసం చేశారు. అక్రమంగా కబేళాలను నడుపుతున్నారని, పరిశీలించేందుకు వెళ్లగా దాడిచేసినట్టు తెలిపారు. సుప్రియో అసన్సోల్ నియోజకవర్గం నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.