కేసీఆర్ అపాయింట్మెంట్ కోరిన బాబు | babu seeks kcr appiontment | Sakshi
Sakshi News home page

కేసీఆర్ అపాయింట్మెంట్ కోరిన బాబు

Oct 17 2015 11:47 AM | Updated on Aug 15 2018 9:30 PM

కేసీఆర్ అపాయింట్మెంట్ కోరిన బాబు - Sakshi

కేసీఆర్ అపాయింట్మెంట్ కోరిన బాబు

ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానపత్రం స్వయంగా అందించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలని చంద్రబాబు కోరారు

ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానపత్రం స్వయంగా అందించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలని చంద్రబాబు కోరారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కార్యాలయానికి ఏపీ సీఎం కార్యాలయం సిబ్బంది ఫోన్ చేశారు. ఆదివారం సాయంత్రం తమకు కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలని సిబ్బంది చెప్పారు.

రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ను ఆహ్వానించేందుకు తాను స్వయంగా వెళ్తానని చంద్రబాబు ఇంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే. సమయం దగ్గర పడుతున్నందున ఈ ఆహ్వాన కార్యక్రమాలను చంద్రబాబు, మంత్రులు వేగవంతం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement