'గవర్నర్కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదు' | Attorney General don't advice to governor on section 8, says Union Law Minister sadananda gowda | Sakshi
Sakshi News home page

'గవర్నర్కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదు'

Jun 25 2015 9:27 AM | Updated on Sep 3 2017 4:21 AM

'గవర్నర్కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదు'

'గవర్నర్కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదు'

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశం 'సెక్షన్ -8' పై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ గురువారం న్యూఢిల్లీలో స్పందించారు.

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశం 'సెక్షన్ -8' పై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ గురువారం న్యూఢిల్లీలో స్పందించారు. సెక్షన్ - 8పై గవర్నర్కు అటార్నీ జనరల్ సలహా ఇవ్వలేదని సదానందగౌడ స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ కోరితే మాత్రం తాము సలహా ఇస్తామన్నారు.

కాగా సెక్షన్ - 8పై కేంద్ర హోం శాఖ ఇప్పటి వరకు తమను సంప్రదించలేదని పేర్కొన్నారు. అలాగే సదరు సెక్షన్పై గవర్నర్కు తను నుంచి కానీ... తమ శాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. సెక్షన్ -8పై ఇప్పటి వరకు న్యాయశాఖ ఎవరికీ ఎలాంటి లేఖ రాయలేదని సదానందగౌడ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement