ఐఫోన్-7 వచ్చేస్తోంది..రేటెంతో తెలుసా! | Apple to bring iPhone7 to India on September 26 | Sakshi
Sakshi News home page

ఐఫోన్-7 వచ్చేస్తోంది..రేటెంతో తెలుసా!

Sep 7 2016 11:06 AM | Updated on Aug 20 2018 2:55 PM

ఐఫోన్-7 వచ్చేస్తోంది..రేటెంతో తెలుసా! - Sakshi

ఐఫోన్-7 వచ్చేస్తోంది..రేటెంతో తెలుసా!

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఐఫోన్-7 అతి త్వరలోనే భారత్ కు రానుంది.

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఐఫోన్-7 అతి త్వరలోనే భారత్ కు రానుంది. నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ గా పేరొందిన ఐఫోన్-7 ఈరోజు (సెప్టెంబర్ 7న) అంతర్జాతీయంగా విడుదల కానుండగా.. మరో 19 రోజుల్లో భారత్ కు ఇది రానుంది. సెప్టెంబర్ 26న ఐఫోన్-7ను భారత్ లో విడుదల చేయనున్నారు.

బుధవారం సాన్ ఫ్రాన్సిస్కోలోని గ్రహం బిల్  సివిక్ ఆడిటోరియంలో అట్టహాసంగా జరగనున్న వేడుకలో ఐఫోన్-7ను ఆపిల్ ఆవిష్కరించనుంది. అంతర్జాతీయంగా ఆపిల్-7 బేస్ మోడల్ (32జీబీ) ధరను 749 డాలర్లుగా నిర్ణయించారు. భారత్ లో దీని ధర సుమారు రూ. 63వేలు ఉండే అవకాశముంది.

అమెరికాలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ మధ్యలో ఐఫోన్-7 అమ్మకాలు ప్రారంభమవుతాయని, భారత్ కు వచ్చేసరికి సెప్టెంబర్ 26నుంచి ఐఫోన్-7 మార్కెట్ లో లభిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, రెండో అతిపెద్ద స్మార్ట్ మార్కెట్ అయిన భారత్ పై ఆపిల్ ఈ మధ్య ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్ లోనే యాపిల్ అత్యధిక అమ్మకాలు జరిపింది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో భారత్ లో ఐఫోన్ అమ్మకాలు 51శాతం పెరిగాయి. అంతేకాకుండా గత ఏడాది తొలిసారిగా భారత్ లో ఆపిల్ కంపెనీ ఒక బిలియన్ డాలర్ మార్క్ ఆదాయాన్ని సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement