సురక్షితం కాని ప్రాంతాలకు ఒక యాప్! | Sakshi
Sakshi News home page

సురక్షితం కాని ప్రాంతాలకు ఒక యాప్!

Published Sat, Aug 9 2014 1:52 PM

App alerts people to avoid unsafe areas

న్యూయార్క్:స్మార్ట్‌ఫోన్ల సందడి పెరుగుతున్న కొద్దీ  ప్రపంచవ్యాప్తంగా మొబైల్ అప్లికేషన్స్(యాప్స్) డౌన్‌లోడ్ల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది. అటు మనకు వచ్చే తలనొప్పి నుంచి బస్సు గుట్టును కూడా ముందుగానే తెలియజేసే ఎన్నో యాప్ లు మన చెంతకు చేరాయి. ఇప్పటికే ఎన్నో యాప్ లు యువత అరచేతిలోకి వస్తే.. తాజాగా సురక్షితం కాని ప్రాంతాలను తెలుసుకోనేందుకు ఓ యాప్ వచ్చింది. ప్రస్తుతం న్యూయార్క్ సిటీకి పరిమితమైన ఈ యాప్ మనల్ని ప్రమాదాల బారిన పడకుండా ముందుగా అలర్ట్ చేస్తుంది.

 

అమెరికాకు చెందిన మైక్ గురే, డేనియల్ హెర్రింగ్టన్ లు రూపొందించిన ఈ ఐ ట్యూన్స్ యాప్ వాకింగ్ డైరెక్షన్ లను తెలియజేయటంతో పాటు సురక్షితం కాని ప్రాంతాలను ముందే పసిగట్టి మనకు హెచ్చరికలు పంపుతుందట. ఈ యాప్ ను ప్రజల్ని నుంచి  సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించినట్లు వారు తెలిపారు. వ్యక్తుల యొక్క జాతీయ గుర్తింపు, వేధింపులు, నిర్జీవమైన ప్రదేశాలతో పాటు తదితర అంశాలతో ఈ యాప్ రూపొందించబడిందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement