breaking news
unsafe areas
-
ఆ నగరాలు సురక్షితం కాదు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని భోపాల్, గ్వాలియర్, రాజస్తాన్లోని జోధ్పూర్ నగరాలు తమకు సురక్షితం కాదని మహిళలు అభిప్రాయపడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ప్రాంతాల్లో జనావాసం తక్కువగా ఉండటం, ఇతర ప్రాంతాలకు ఇవి సుదూరంగా ఉండటం వంటి కారణాల వల్ల తమకు రక్షణ కరువైనట్లు మహిళలు భావిస్తున్నారు. సామాజిక సంస్థలు సేఫ్టీపిన్, కొరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, ఆసియా ఫౌండేషన్లు ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. దీనికి గానూ భోపాల్ (77), గ్వాలియర్ (75), జోధ్పూర్ (67) నగరాల నుంచి 219 సర్వేల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించాయి. ఈ మూడు ప్రాంతాల్లో నివసించే విద్యార్థుల్లో 57.1 శాతం, అవివాహిత యువతుల్లో 50.1 శాతం మంది లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ ప్రదేశాలు నిర్జనంగా ఉండటం వల్ల తమకు రక్షణ కరువైందని 89 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. తమకు రక్షణ కరువైందని భావించడానికి మహిళలు పలు కారణాలను వెల్లడించారు. డ్రగ్స్, మద్యం అందుబాటులో ఉండటం (86 శాతం), ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం (63 శాతం), సరైన భద్రత లేకపోవడం (68 శాతం) వంటివి కారణాలుగా పేర్కొన్నారు. బస్సులు, ఆటోల్లో ప్రయాణించే సమయంలో కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు 50 శాతం మంది తెలిపారు. మార్కెట్లు వంటి చోట్ల వేధింపులకు గురవుతున్నామని 39 శాతం మంది వెల్లడించారు. రోడ్డు పక్కన వెళ్తుండగా (26 శాతం మంది), ట్రాన్స్పోర్ట్ కోసం వేచిచూసే సమయంలో (16 శాతం) సైతం లైంగిక వేధింపులకు గురవుతున్నామని చెప్పారు. -
సురక్షితం కాని ప్రాంతాలకు ఒక యాప్!
న్యూయార్క్:స్మార్ట్ఫోన్ల సందడి పెరుగుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా మొబైల్ అప్లికేషన్స్(యాప్స్) డౌన్లోడ్ల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది. అటు మనకు వచ్చే తలనొప్పి నుంచి బస్సు గుట్టును కూడా ముందుగానే తెలియజేసే ఎన్నో యాప్ లు మన చెంతకు చేరాయి. ఇప్పటికే ఎన్నో యాప్ లు యువత అరచేతిలోకి వస్తే.. తాజాగా సురక్షితం కాని ప్రాంతాలను తెలుసుకోనేందుకు ఓ యాప్ వచ్చింది. ప్రస్తుతం న్యూయార్క్ సిటీకి పరిమితమైన ఈ యాప్ మనల్ని ప్రమాదాల బారిన పడకుండా ముందుగా అలర్ట్ చేస్తుంది. అమెరికాకు చెందిన మైక్ గురే, డేనియల్ హెర్రింగ్టన్ లు రూపొందించిన ఈ ఐ ట్యూన్స్ యాప్ వాకింగ్ డైరెక్షన్ లను తెలియజేయటంతో పాటు సురక్షితం కాని ప్రాంతాలను ముందే పసిగట్టి మనకు హెచ్చరికలు పంపుతుందట. ఈ యాప్ ను ప్రజల్ని నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించినట్లు వారు తెలిపారు. వ్యక్తుల యొక్క జాతీయ గుర్తింపు, వేధింపులు, నిర్జీవమైన ప్రదేశాలతో పాటు తదితర అంశాలతో ఈ యాప్ రూపొందించబడిందన్నారు.