తమిళనాడులో మరో స్వాతి.. | Another Swathi? Jilted lover in Tamil Nadu sets himself afire, then hugs teen | Sakshi
Sakshi News home page

తమిళనాడులో మరో స్వాతి..

Jul 31 2016 4:09 PM | Updated on Sep 4 2017 7:13 AM

తమిళనాడులో మరో స్వాతి..

తమిళనాడులో మరో స్వాతి..

చెన్నైలోని ఓ రైల్వేస్టేషన్ లో నెల క్రితం ప్రేమించలేందంటూ టెకీ స్వాతిని నరికిచంపిన ఘటన మరువకముందే..

తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ రైల్వేస్టేషన్ లో నెల క్రితం ప్రేమించలేందంటూ టెకీ స్వాతిని నరికిచంపిన ఘటన మరువకముందే విల్లుపురం జిల్లాలో శనివారం మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదంటూ ఓ ఉన్మాది ఆమెకు నిప్పంటించబోయాడు. సెంథిల్(32) ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గత ఏడాది కాలంగా నవీన అనే అమ్మాయి వెనుకతిరిగాడు. ఈ సమయంలో అతన్ని రైలు ఢీకొనడంతో యాక్సిడెంట్ లో కుడి చేయి, కుడి కాలు పోయాయి. కాలు, చేయి లేకపోవడంతో నవీన తనను రెజెక్ట్ చేస్తుందని భావించిన అతను.. ఆమెను అంతమొందించాలనుకున్నాడు.

శనివారం సెంథిల్ నవీన ఇంటిబయట దాక్కున్నాడు. నవీన్ ఇంట్లో పెద్దలందరూ వెళ్లిపోయే వరకూ వెయిట్ చేశాడు. వాళ్లు ఇల్లు వదిలి బయటకు వెళ్లగానే లోపలికి ప్రవేశించాడు. ఇంట్లో నవీనతో పాటు ఉన్న ఆమె సోదరి, సోదరులను కత్తి చూపించి బెదిరించాడు. మొదట నవీనకు నిప్పంటిచే ప్రయత్నం చేసినా సఫలం కాకపోవడంతో, తన మీద తానే పెట్రోల్ పోసుకున్నాడు. నిప్పంటించుకుని నవీనకు కూడా అంటించాడు. ఈలోగా ఇంటి నుంచి పెద్దగా అరుపులు వినిపిస్తుండంతో స్థానికులు ఇంటి తలుపులు పగులగొట్టి ఆమెను కాపాడారు. అప్పటికే సెంథిల్ అక్కడికక్కడే కాలిబూడిదయ్యాడు. గాయాలపాలైన నవీనను పాండిచ్చేరిలోని జింపర్ ఆసుపత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో నవీన ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement