దూసుకొచ్చిన వారసుడు
రిలయన్స్ గ్రూప్ అధ్యక్షుడు అనిల్ ధీరూబాయ్ అంబానీ పెద్ద కొడుకు జై అన్మోల్ అంబానీ (24) ఎడిషనల్ డైరెక్టర్ గా నియమితుడయ్యారు.
	ముంబై: కార్పొరేట్ దిగ్గజం  రిలయన్స్ క్యాపిటల్  కంపెనీలోకి  కొత్త వారసుడు దూసుకొచ్చాడు.   రిలయన్స్ గ్రూప్ అధ్యక్షుడు అనిల్ ధీరూబాయ్ అంబానీ పెద్ద కొడుకు  జై అన్మోల్ అంబానీ (24)  ఎడిషనల్ డైరెక్టర్ గా నియమితుడయ్యారు. ఈ మేరకు  కంపెనీ బోర్డు  మంగళవారం  ఆమోదం తెలిపింది.   రిలయన్స్ క్యాపిటల్  బోర్డు ఆధ్వర్యంలోని నామినేషన్ అండ్ కాంపన్సేషన్ కమిటీ సిఫారసులకు మేరకు  బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
	
	దీనిపై అన్మోల్  అంబానీ  సంతోషం వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో గత రెండేళ్లుగా తనకున్న అనుభవం  వ్యాపారవృద్ధిలో తనకు సహాయపడనుందని తెలిపారు.  ఫాస్ట్ లెర్నర్ గా  వివిధ నిర్ణయాలసందర్భంగా   యాక్టివ్ పార్టిసిపెంట్ గా ఉన్న  అన్ మోల్ ను  ఆహ్వానిస్తున్నామని,  రిలయన్స్ కాపిటల్ ఈడీ, గ్రూప్ సీఈవో సామ్ ఘోష్ ఆయనకుస్వాగతం పలికారు.
	కాగా జై అన్మోల్ 2014 నుంచి  రిలయన్స్ క్యాపిటల్  తన సేవలను అందించారు.  'వార్విక్ బిజినెస్ స్కూల్' నుంచి డిగ్రీ పొందిన   ఇతడికి ఫైనాన్స్ రంగంపై ఆసక్తి ఎక్కువ.  ఈ నేపథ్యంలో  రిలయన్స్ క్యాపిటల్ వివిధ కంపెనీలను టేకోవర్ చేస్తూ దూసుకెడుతున్న సంగతి తెలిసిందే.  
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
