
కత్తితో గొంతు కోసేందుకు ప్రయత్నం
బాధితుడి భార్యను, ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహబూబాబాద్ రూరల్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ఓ భార్య యత్నించగా.. తీవ్ర గాయా లతో భర్త తప్పించుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మేడ ప్రసాద్‌కు జిల్లాలోని కొత్తగూడ మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన రష్మితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.
కుమారుడు పుట్టినప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గంగారం మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన మద్దెల అనిల్‌తో రషి్మకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో భర్త ప్రసాద్‌ను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ క్రమంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ప్రియుడు అనిల్‌ను రష్మి ఫోన్ చేసి పిలిపించింది.
నిద్రిస్తున్న ప్రసాద్‌ను రషి్మ వెనుక నుంచి అదిమిపట్టుకోగా అనిల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి చంపేందుకు ప్రయతి్నంచాడు. తప్పించుకునే ప్రయత్నంలో ప్రసాద్‌కు ఎడమ చెవి, ఎడమ చేయి, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రసాద్ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు, తండ్రి పాపయ్య అక్కడికి చేరుకుని అనిల్‌ను పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అనిల్, రష్మిని అదుపులోకి తీసుకుని మహబూబాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రసాద్‌ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.