అంతర్జాతీయ పోటీలో నిలబడాలంటే ఇవి తప్పదు
యూరోపియన్ దేశాల నుంచి ఇప్పటికే దీనిపై ఒత్తిడి
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్
హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈఎస్‌జీ లీడర్‌షిప్ సదస్సు
విజన్, విధానాలతోనే మనకు విజయాలు
నలంద విశ్వవిద్యాలయ మాజీ వీసీ ప్రొఫెసర్ సునయనా సింగ్
హైదరాబాద్: ఈఎస్‌జీ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే అంతర్జాతీయ పోటీలో మనుగడ సాధించలేమని, అందువల్ల యాజమాన్య స్థానాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ వీటి గురించి అర్థం చేసుకుని, తమ ఉత్పత్తులన్నీ వాటికి కట్టుబడేలా చూసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బేగంపేటలోని హోటల్ ప్లాజాలో శుక్రవారం నిర్వహించిన ఈఎస్‌జీ లీడర్‌షిప్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ, ‘‘కొన్ని రోజుల క్రితమే మేం తెలంగాణ రైజింగ్ పేరుతో ఇటీవలే గ్లోబల్ సమ్మిట్ అనే పెద్ద సదస్సు నిర్వహించాం.
అందులో భాగంగా విజన్ డాక్యుమెంట్ విడుదల చేశాం. 2047 నాటికి..l. భారతదేశం 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మన రాష్ట్రం వాటా అందులో ఎంత ఉండాలన్నది ఒక లక్ష్యం రూపొందించుకున్నాం. చాలా లోతుగా చర్చించి దీన్ని రూపొందించాం. మీరు కూడా మన రాష్ట్రంలోని స్టార్టప్‌లు ఏం చేస్తున్నాయి, ఏం సాధించాయన్న వివరాలతో ఒక మంచి పత్రం రూపొందించండి. వాటికి మేం ప్రభుత్వపరంగా ఏం చేయగలమో చూసి తప్పక చేస్తాం. ఒక్కో దేశానికి ఒక్కో తరహా రిపోర్టింగ్ అవసరమవుతుంది. ఆ దేశ చట్టాలను బట్టి మనం మన రిపోర్టులు ఇవ్వాలి. వాటిని ఆడిట్ చేయగలిగేలా ఉండాలి. హెచ్ఎంఏ ఆధ్వర్యంలో సర్టిఫికేషన్ కోర్సు ప్రారంభించడం చాలా బాగుంది. మీరు చేస్తున్నదానివల్ల ఈ నగరం, రాష్ట్రం, దేశం కూడా బాగుపడతాయి. అందువల్ల మనమంతా హృదయపూర్వకంగా దీన్ని స్వాగతించాలి.

ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాలు తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందాయి. 93 దేశాలకు ఇక్కడినుంచి ఉత్పత్తులు వెళ్తాయి. కానీ, ఇటీవల యూరప్ నుంచి ఒక అల్టిమేటం వచ్చింది. మీరు ఈఎస్‌జీకి అనుగుణంగా లేకపోతే మీ ఉత్పత్తులు నిషేధిస్తామని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన ముప్పు. అంతర్జాతీయ మార్కెట్లకు ఇది అవసరం. అమెరికా పెద్ద మార్కెట్ అయినా, అక్కడి సుంకాల కారణంగా మనం యూరోపియన్ మార్కెట్లపై దృష్టిపెట్టాలి. అందుకు ఈఎస్‌జీకి కట్టుబడి ఉండాల్సిందే. అందుకే మీరు చేస్తున్న కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఎగుమతుల ద్వారానే తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థను సాధించగలదు. రాబోయే 22 ఏళ్లలో మన ఎగుమతులు పదిరెట్లు పెరుగుతాయి.
ఈఎస్‌జీ అంటే ఎన్విరాన్‌మెంటల్, సోషల్, అండ్ గవర్నెన్స్.. అంటే మన ఉత్పత్తులు పర్యావరణానికి చేటు చేయకూడదు, సమాజానికి మంచి చేయాలి, పాలనాపరమైన నిబంధనలకు కట్టుబడి ఉండాలి. సరిగ్గా ఈ విషయంలోనే హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈఎస్‌జీ లీడర్‌షిప్ కార్యక్రమం నిర్వహించడం బాగుంది. ఇప్పుడు చాలా కంపెనీల్లో మహిళలు అగ్ర, నాయకత్వ స్థానాల్లో ఉంటున్నారు. వీరందరూ కూడా ఈఎస్‌జీ నిబంధనలను అర్థం చేసుకుని, వాటికి తగినట్లుగా తమ ఉత్పత్తులు ఉండేలా చూసుకుంటే అంతర్జాతీయ పోటీలో మనం నిలబడగలం. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ సభ్యులు కాలానికి తగినట్లుగా రూపాంతరం చెంది.. తమను తాము నిరూపించుకుంటారని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు.

నలందలో నెట్ జీరో లక్ష్యం ఇలా సాధించాను: ప్రొఫెసర్ సునయనా సింగ్
నలంద విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ సునయనా సింగ్ మాట్లాడుతూ, ‘‘నేను నలంద విశ్వవిద్యాలయంలో బాధ్యతలు చేపట్టేసరికి అదంతా బంజరు భూమిలా ఉండేది. ఒకే ఒక్క అంతర్జాతీయ విద్యార్థి ఉండేవారు, మొత్తం విద్యార్థుల సంఖ్య కేవలం 28 మాత్రమే. నేను వెళ్లేసరికి వెయ్యి మంది విద్యార్థులయ్యారు. మొత్తం 455 ఎకరాల భూమిని పచ్చగా మార్చగలిగాం. అందులో 300 ఎకరాలు కేవలం మొక్కలే ఉంటాయి. మొదట్లో నాకు చిన్న గది ఉండేది. 2017లో నేను చేరాను, 2019 నాటికి కొత్త ప్రాంగణంలో ఉన్నాము. కొవిడ్ సమయంలో కూడా తగినన్ని నిర్మాణాలు చేశాం. ఇవన్నీ నెట్ జీరో విధానంలోనే ఉంటాయి. అసలు ముందు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేరుగా నన్ను సంప్రదించారు. ఈ మొత్తం ప్రాంగణాన్ని పునర్నిర్మించాలన్నారు. ఆయన నమ్మకం నన్ను చాలా భయపెట్టింది.
అయినా ఒక ప్రయత్నం చేయాలని.. అక్కడ చేరి, ముందుగా నెట్ జీరో కమిటీ ఏర్పాటుచేశాను. వరుసగా వచ్చిన కేంద్ర ప్రభుత్వాల్లో నాకు చాలా మద్దతు లభించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గానీ, తర్వాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, మురళీమనోహర్ జోషి లాంటివారు నెట్ జీరో లక్ష్యం చూసి ఎంతో ప్రోత్సహించారు. తర్వాత నేను ఇఫ్లూకు రాకముందు లాల్‌బహదూర్ శాస్త్రి గారి పేరుతో ఉన్న ఒక రెండు దేశాల పరిశోధన సంస్థకు నాయకత్వం వహించాను.
భారత్, కెనడాలకు చెందిన దాదాపు 98 ఉన్నతస్థాయి విద్యాసంస్థలు దానికి అనుబంధంగా ఉండేవి. అందులో ప్రధానంగా ఇంగ్లీషు భాషలో పీహెచ్‌డీలు చేసేవారు. దానికి అప్పటి కేంద్ర మానవనరుల శాఖ మంత్రి మురళీ మనోహర్ జోషి ఎంతగానో ప్రోత్సాహం కల్పించారు. యాజమాన్యాలు ఎప్పుడూ ఒక విషయం ప్రాక్టీసు చేయాలి. మనకు ప్రధానంగా రెండు విషయాలపై అవగాహన ఉండాలి. అవి విజన్, విధానాలు. ఏదో సాధించాలన్న లక్ష్యం లేకపోతే మనం ముందుకు వెళ్లలేం. అది సాధించాలంటే మనకు కొన్ని స్పష్టమైన విధానాలు ఉండాలి. ముందుగా భాగస్వాములందరినీ ఒక తాటిమీదకు తెచ్చి, సరైన విధానాలు ఏర్పరుచుకోవాలి. అప్పుడే మన రంగంలో మనం విజయాలు సాధించగలం’’ అని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ ఎస్ జి పైన జరుగుతున్న ఈ చర్చలు నేపథ్యంలో మనము 2% టెంపరేచర్ తగ్గించడం చేస్తున్నాము ఇందులో భాగంగా భారతదేశ ప్రభుత్వం కూడా 2070కి కార్బన్ నెట్ జీరో ది గూగుల్ తీసుకోండి తెలంగాణ ప్రభుత్వము తమ రైసింగ్ తెలంగాణ గ్లోబల్ సిమెంట్ లో 2047 కే కార్బన్ 80 గోల్ తీసుకుంది , 3 ట్రిలియన్ ఎకనామితో పాటు అందరినీ ఇంక్లూజివ్ గా సోషల్ గా అందరిని తెలుసుకోవాలని తీసుకొని దాంతోపాటు 2047 కి కార్బన్ నెట్ 0 వైపు తీసుకెళ్తుంది ఇందులో ప్రతి తెలంగాణ పౌరుడు కూడా వారి రూల్ ప్లే చేయాల్సి ఉంటుంది అందులో భాగంగా హెచ్ఎం వాళ్ళు చేసింది ఈ సదస్సు ఈ ఆక్టివిటీ ఆ దృక్పథం వైపు తీసుకెళ్తుంది, గ్రీన్ అనేది జీవన విధానంగా ఉండాలి అనే దానిపై హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్వాల దేవేందర్ రెడ్డి గారు చెప్పారు
వ్యక్తుల గ్రీన్ ప్రయత్నాలకు బహుమతులు ఇచ్చే వ్యక్తిగత గ్రీన్ స్కోర్ కార్డ్. సుస్థిరతపై పనిచేసే నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు విద్యార్థులను గ్రీన్ జాబ్స్ వైపు మార్గనిర్దేశం చేయడానికి HMA ESGపై సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌తో ముందుకు వస్తోందని ఉపాధ్యక్షుడు శరత్ చంద్ర మరోజు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంకా.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధిపతి మనీషా సాబూ, ఐఎంటీ హైదరాబాద్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీహర్షరెడ్డి, స్వతంత్ర మీడియా, కమ్యూనికేషన్స్ నిపుణుడు సురేష్ కొచ్చాటిల్, మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్‌కు చెందిన అనిర్బన్ ఘోష్, ధ్రుమతారు కన్సల్టెంట్స్ సీఈఓ, హెచ్ఎంఏ యాజమాన్య కమిటీ సభ్యురాలు చేతనా జైన్ తదితరులు పాల్గొని తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించారు.


