breaking news
jayeshranjan
-
ఈఎస్జీ నిబంధనలతోనే మనుగడ
హైదరాబాద్: ఈఎస్జీ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే అంతర్జాతీయ పోటీలో మనుగడ సాధించలేమని, అందువల్ల యాజమాన్య స్థానాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ వీటి గురించి అర్థం చేసుకుని, తమ ఉత్పత్తులన్నీ వాటికి కట్టుబడేలా చూసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బేగంపేటలోని హోటల్ ప్లాజాలో శుక్రవారం నిర్వహించిన ఈఎస్జీ లీడర్షిప్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ, ‘‘కొన్ని రోజుల క్రితమే మేం తెలంగాణ రైజింగ్ పేరుతో ఇటీవలే గ్లోబల్ సమ్మిట్ అనే పెద్ద సదస్సు నిర్వహించాం. అందులో భాగంగా విజన్ డాక్యుమెంట్ విడుదల చేశాం. 2047 నాటికి..l. భారతదేశం 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మన రాష్ట్రం వాటా అందులో ఎంత ఉండాలన్నది ఒక లక్ష్యం రూపొందించుకున్నాం. చాలా లోతుగా చర్చించి దీన్ని రూపొందించాం. మీరు కూడా మన రాష్ట్రంలోని స్టార్టప్‌లు ఏం చేస్తున్నాయి, ఏం సాధించాయన్న వివరాలతో ఒక మంచి పత్రం రూపొందించండి. వాటికి మేం ప్రభుత్వపరంగా ఏం చేయగలమో చూసి తప్పక చేస్తాం. ఒక్కో దేశానికి ఒక్కో తరహా రిపోర్టింగ్ అవసరమవుతుంది. ఆ దేశ చట్టాలను బట్టి మనం మన రిపోర్టులు ఇవ్వాలి. వాటిని ఆడిట్ చేయగలిగేలా ఉండాలి. హెచ్ఎంఏ ఆధ్వర్యంలో సర్టిఫికేషన్ కోర్సు ప్రారంభించడం చాలా బాగుంది. మీరు చేస్తున్నదానివల్ల ఈ నగరం, రాష్ట్రం, దేశం కూడా బాగుపడతాయి. అందువల్ల మనమంతా హృదయపూర్వకంగా దీన్ని స్వాగతించాలి. ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాలు తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందాయి. 93 దేశాలకు ఇక్కడినుంచి ఉత్పత్తులు వెళ్తాయి. కానీ, ఇటీవల యూరప్ నుంచి ఒక అల్టిమేటం వచ్చింది. మీరు ఈఎస్‌జీకి అనుగుణంగా లేకపోతే మీ ఉత్పత్తులు నిషేధిస్తామని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన ముప్పు. అంతర్జాతీయ మార్కెట్లకు ఇది అవసరం. అమెరికా పెద్ద మార్కెట్ అయినా, అక్కడి సుంకాల కారణంగా మనం యూరోపియన్ మార్కెట్లపై దృష్టిపెట్టాలి. అందుకు ఈఎస్‌జీకి కట్టుబడి ఉండాల్సిందే. అందుకే మీరు చేస్తున్న కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఎగుమతుల ద్వారానే తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థను సాధించగలదు. రాబోయే 22 ఏళ్లలో మన ఎగుమతులు పదిరెట్లు పెరుగుతాయి. ఈఎస్జీ అంటే ఎన్విరాన్మెంటల్, సోషల్, అండ్ గవర్నెన్స్.. అంటే మన ఉత్పత్తులు పర్యావరణానికి చేటు చేయకూడదు, సమాజానికి మంచి చేయాలి, పాలనాపరమైన నిబంధనలకు కట్టుబడి ఉండాలి. సరిగ్గా ఈ విషయంలోనే హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈఎస్జీ లీడర్షిప్ కార్యక్రమం నిర్వహించడం బాగుంది. ఇప్పుడు చాలా కంపెనీల్లో మహిళలు అగ్ర, నాయకత్వ స్థానాల్లో ఉంటున్నారు. వీరందరూ కూడా ఈఎస్జీ నిబంధనలను అర్థం చేసుకుని, వాటికి తగినట్లుగా తమ ఉత్పత్తులు ఉండేలా చూసుకుంటే అంతర్జాతీయ పోటీలో మనం నిలబడగలం. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు కాలానికి తగినట్లుగా రూపాంతరం చెంది.. తమను తాము నిరూపించుకుంటారని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు.నలందలో నెట్ జీరో లక్ష్యం ఇలా సాధించాను: ప్రొఫెసర్ సునయనా సింగ్ నలంద విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సునయనా సింగ్ మాట్లాడుతూ, ‘‘నేను నలంద విశ్వవిద్యాలయంలో బాధ్యతలు చేపట్టేసరికి అదంతా బంజరు భూమిలా ఉండేది. ఒకే ఒక్క అంతర్జాతీయ విద్యార్థి ఉండేవారు, మొత్తం విద్యార్థుల సంఖ్య కేవలం 28 మాత్రమే. నేను వెళ్లేసరికి వెయ్యి మంది విద్యార్థులయ్యారు. మొత్తం 455 ఎకరాల భూమిని పచ్చగా మార్చగలిగాం. అందులో 300 ఎకరాలు కేవలం మొక్కలే ఉంటాయి. మొదట్లో నాకు చిన్న గది ఉండేది. 2017లో నేను చేరాను, 2019 నాటికి కొత్త ప్రాంగణంలో ఉన్నాము. కొవిడ్ సమయంలో కూడా తగినన్ని నిర్మాణాలు చేశాం. ఇవన్నీ నెట్ జీరో విధానంలోనే ఉంటాయి. అసలు ముందు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేరుగా నన్ను సంప్రదించారు. ఈ మొత్తం ప్రాంగణాన్ని పునర్నిర్మించాలన్నారు. ఆయన నమ్మకం నన్ను చాలా భయపెట్టింది. అయినా ఒక ప్రయత్నం చేయాలని.. అక్కడ చేరి, ముందుగా నెట్ జీరో కమిటీ ఏర్పాటుచేశాను. వరుసగా వచ్చిన కేంద్ర ప్రభుత్వాల్లో నాకు చాలా మద్దతు లభించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గానీ, తర్వాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, మురళీమనోహర్ జోషి లాంటివారు నెట్ జీరో లక్ష్యం చూసి ఎంతో ప్రోత్సహించారు. తర్వాత నేను ఇఫ్లూకు రాకముందు లాల్‌బహదూర్ శాస్త్రి గారి పేరుతో ఉన్న ఒక రెండు దేశాల పరిశోధన సంస్థకు నాయకత్వం వహించాను. భారత్, కెనడాలకు చెందిన దాదాపు 98 ఉన్నతస్థాయి విద్యాసంస్థలు దానికి అనుబంధంగా ఉండేవి. అందులో ప్రధానంగా ఇంగ్లీషు భాషలో పీహెచ్‌డీలు చేసేవారు. దానికి అప్పటి కేంద్ర మానవనరుల శాఖ మంత్రి మురళీ మనోహర్ జోషి ఎంతగానో ప్రోత్సాహం కల్పించారు. యాజమాన్యాలు ఎప్పుడూ ఒక విషయం ప్రాక్టీసు చేయాలి. మనకు ప్రధానంగా రెండు విషయాలపై అవగాహన ఉండాలి. అవి విజన్, విధానాలు. ఏదో సాధించాలన్న లక్ష్యం లేకపోతే మనం ముందుకు వెళ్లలేం. అది సాధించాలంటే మనకు కొన్ని స్పష్టమైన విధానాలు ఉండాలి. ముందుగా భాగస్వాములందరినీ ఒక తాటిమీదకు తెచ్చి, సరైన విధానాలు ఏర్పరుచుకోవాలి. అప్పుడే మన రంగంలో మనం విజయాలు సాధించగలం’’ అని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా ఈ ఎస్ జి పైన జరుగుతున్న ఈ చర్చలు నేపథ్యంలో మనము 2% టెంపరేచర్ తగ్గించడం చేస్తున్నాము ఇందులో భాగంగా భారతదేశ ప్రభుత్వం కూడా 2070కి కార్బన్ నెట్ జీరో ది గూగుల్ తీసుకోండి తెలంగాణ ప్రభుత్వము తమ రైసింగ్ తెలంగాణ గ్లోబల్ సిమెంట్ లో 2047 కే కార్బన్ 80 గోల్ తీసుకుంది , 3 ట్రిలియన్ ఎకనామితో పాటు అందరినీ ఇంక్లూజివ్ గా సోషల్ గా అందరిని తెలుసుకోవాలని తీసుకొని దాంతోపాటు 2047 కి కార్బన్ నెట్ 0 వైపు తీసుకెళ్తుంది ఇందులో ప్రతి తెలంగాణ పౌరుడు కూడా వారి రూల్ ప్లే చేయాల్సి ఉంటుంది అందులో భాగంగా హెచ్ఎం వాళ్ళు చేసింది ఈ సదస్సు ఈ ఆక్టివిటీ ఆ దృక్పథం వైపు తీసుకెళ్తుంది, గ్రీన్ అనేది జీవన విధానంగా ఉండాలి అనే దానిపై హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్వాల దేవేందర్ రెడ్డి గారు చెప్పారువ్యక్తుల గ్రీన్ ప్రయత్నాలకు బహుమతులు ఇచ్చే వ్యక్తిగత గ్రీన్ స్కోర్ కార్డ్. సుస్థిరతపై పనిచేసే నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు విద్యార్థులను గ్రీన్ జాబ్స్ వైపు మార్గనిర్దేశం చేయడానికి HMA ESGపై సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌తో ముందుకు వస్తోందని ఉపాధ్యక్షుడు శరత్ చంద్ర మరోజు అన్నారు.ఈ కార్యక్రమంలో ఇంకా.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధిపతి మనీషా సాబూ, ఐఎంటీ హైదరాబాద్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీహర్షరెడ్డి, స్వతంత్ర మీడియా, కమ్యూనికేషన్స్ నిపుణుడు సురేష్ కొచ్చాటిల్, మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్‌కు చెందిన అనిర్బన్ ఘోష్, ధ్రుమతారు కన్సల్టెంట్స్ సీఈఓ, హెచ్ఎంఏ యాజమాన్య కమిటీ సభ్యురాలు చేతనా జైన్ తదితరులు పాల్గొని తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించారు. -
రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన సాంకేతికత, రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్‌రంజన్ పేర్కొన్నారు. నానక్‌రాంగూడలోని షరటాన్ హోటల్లో శనివారం రోబోటిక్ గైనకలాజికల్ సర్జరీపై రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన అపోలో ఆస్పత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతికత, పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోబోటిక్స్ పాలసీని ప్రారంభించామన్నారు. దేశంలోనే నిర్దిష్ట రోబోటిక్ పాలసీని కలిగి ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ పాలసీలో భాగంగా హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, కన్సూ్మర్ రోబోటిక్స్ అనే నాలుగు వర్టికల్స్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించామన్నారు. రోబోలను తయారు చేసే కొన్ని ప్రీమియర్ కంపెనీలతో ముందస్తుగా చర్చలు జరుపుతున్నామన్నారు. నిమ్స్‌లో డావిన్సీ ఎక్స్ఐ 4వ వెర్షన్ సిస్టమ్‌ను పూర్తి స్థాయిలో అమర్చిన రోబోటిక్ సర్జరీ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ అపోలో ఆస్పత్రులలో ఇప్పటి వరకు 12 వేల రోబోటిక్ సర్జరీలు చేశామన్నారు. అందులో డాక్టర్ రుమా సిన్వా స్వయంగా 700 రోబోటిక్ సర్జరీలు చేశారన్నారు. అనంతరం సమావేశం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఆర్‌ఎస్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ రమాజోíÙ, ఆర్నాల్డ్ పి.అడ్విన్కులా, డాక్టర్ టోనిచల్ హౌబ్, డాక్టర్ జోసెఫ్ పాల్గొన్నారు. -
ఉన్నత విద్యలో తగ్గనున్న సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో సిలబస్‌ను, పని దినాలను 50 శాతానికి తగ్గించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని, ఆ మార్గదర్శకాలు వచ్చాక పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఉన్నత స్థాయి సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. బుధవారం సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ జయేశ్‌రంజన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు ఇంజనీరింగ్, ఇతర కాలేజీల యాజమాన్యాలతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలు, విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది సమావేశంలో వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే కేంద్రం మార్గదర్శకాలు ముందుగా వస్తే అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని, లేదంటే రాష్ట్రంలో ముందుగా ఆన్లైన్లో పాఠాలను సెప్టెంబర్‌లో ప్రారంభించాలని, ఆ తరువాత కరోనా పరిస్థితిని బట్టి ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు విదేశీ విద్యకు, ఉద్యోగాల కోసం వెళ్లాల్సి ఉన్నందున వారికి ఈనెల 20 నుంచి పరీక్షలు నిర్వహించాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు సెప్టెంబర్‌లో కాలేజీలు తెరిచినా హాస్టళ్లు తెరవద్దని, భౌతిక దూరం పాటించడం కష్టం అవుతుందన్న భావన వ్యక్తమైంది. కాలేజీల ప్రారంభంతోపాటు ఇతర పరీక్షలు, డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబ«ంధించి ఈనెల 15న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో భేటీ కానున్నట్లు తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. అవసరమైతే ఆ తరువాత ముఖ్యమంత్రితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
త్వరలో టీ–హబ్ రెండో దశ
రాయదుర్గం: రాష్ట్రంలో టీ–హబ్ సెకండ్ ఫేజ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్ పేర్కొన్నారు. గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ ప్రాంగణంలోని టీ–హబ్‌లో సామాజిక ప్రభావ స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఉబెర్ ఎక్సేంజ్‌తో టీ–హబ్‌ల మధ్య కుదిరిన ఒప్పందంపై మంగళవారం రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇస్తోందన్నారు. అందులో భాగంగా అన్ని సౌకర్యాలతో కూడిన టీ హబ్‌ను ఏర్పాటు చేశామని, దీన్ని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. నగరంలో రెండవ దశ టీహబ్‌ను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేశామన్నారు. నిజామాబాద్‌లో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు. ఉబెర్ ఏషియా బిజినెస్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ఎంతో సంతోషానిచ్చిందన్నారు. సామాజిక ప్రభావ స్టార్టప్‌ల కింద ఎంపిక చేసిన వాటికి మెంటరింగ్, ఫండింగ్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఫైనాన్స్, టెక్నాలజీని అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.ఎంపిక చేసిన టాప్ 20 స్టార్టప్ కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. అనంతరం ఉబెర్ ఇండియా పబ్లిక్ పాలసీస్ గవర్నమెంట్ అఫైర్స్ హెడ్ కిరణ్ వివేకానంద, టీ హబ్ సీఈఓ జయ్‌కృష్ణ ఒప్పందంపై సంతకాలు చేశారు.


