రెండు దశాబ్దాల తరువాత అమల అక్కినేని | Amala plays lawyer in her comeback Malayalam film | Sakshi
Sakshi News home page

రెండు దశాబ్దాల తరువాత అమల అక్కినేని

Aug 20 2016 1:15 PM | Updated on Sep 4 2017 10:06 AM

రెండు దశాబ్దాల తరువాత అమల అక్కినేని

రెండు దశాబ్దాల తరువాత అమల అక్కినేని

మాజీ హీరోయిన్, టాలీవుడ్ హీరో నాగార్జున అక్కినేని సతీమణి అమల అక్కినేని రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ మలయాళ సినీ పరశ్రమలో అడుగుపెడుతున్నారు

చెన్నై:  మాజీ హీరోయిన్, టాలీవుడ్  హీరో నాగార్జున అక్కినేని సతీమణి అమల  అక్కినేని రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ  మలయాళ సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. అమల తాజాగా ఓ మలయాళ సినిమాలో  న్యాయవాది పాత్రను పోషిస్తున్నారట. ఆంటోనీ సోనీ  సారధ్యంలో  డెబ్యూ మూవీగా   వస్తున్న చిత్రం 'కేరాఫ్   సైరాబాను'  అనే చిత్రంలోఆమె నటించనున్నారట.  ఆనీ జాన్ అనే న్యాయవాది పాత్రలో  ఆమె కనిపించబోతున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.

ప్రముఖ ప్రవక్త  సైరాబాను  పాత్రను  మంజు వారియర్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్  ఈ  త్వరలోనే మొదలు కానుందని వివరించాయి. కాగా  మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కథానాయకుడుగా 1991లో వచ్చిన ' ఉల్లడక్కం'  సినిమాలో అమల నటించారు.   అయితే  సెకండ్  ఇన్నింగ్స్ మొదలు పెట్టిన  అమల  హమారీ అధూరీ కహానీ  బాలీవుడ్ చిత్రంలో ఆఖరిసారిగా నటించిన సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement