ఓపీఎస్‌కు వెల్లువెత్తిన 'సినీ' మద్దతు! | Actors rallies behind Panneerselvam | Sakshi
Sakshi News home page

ఓపీఎస్‌కు వెల్లువెత్తిన 'సినీ' మద్దతు!

Feb 18 2017 6:27 PM | Updated on Sep 5 2017 4:02 AM

ఓపీఎస్‌కు వెల్లువెత్తిన 'సినీ' మద్దతు!

ఓపీఎస్‌కు వెల్లువెత్తిన 'సినీ' మద్దతు!

బలపరీక్షలో ఓడిపోయినప్పటికీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వానికి సినీ ప్రముఖుల నుంచి మద్దతు వెల్లువెత్తడం గమనార్హం.

చెన్నై: బలపరీక్షలో ఓడిపోయినప్పటికీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వానికి సినీ ప్రముఖుల నుంచి మద్దతు వెల్లువెత్తడం గమనార్హం. బలపరీక్షను తీవ్రంగా తప్పుబట్టిన ప్రముఖ సినీ నటి గౌతమి నేరుగా ఓపీఎస్‌కు మద్దతు ప్రకటించారు. బలపరీక్షలో గెలిచిన శశికళ నమ్మినబంటు పళనిస్వామి బృందాన్ని ఖండించారు. 'అంకెల గారడీ'  ద్వారా ప్రజాస్వామ్యాన్ని వంచించలేరని, ఇది ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజాస్వామ్యం కొనసాగుతుందని ఆమె ట్వీట్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాడాపాండి.. ముఖ్యమంత్రి ఓపీఎస్సే కావాలంటూ ఆమె యాష్‌ట్యాగ్‌ జోడించారు.

Advertisement
 
Advertisement
Advertisement