'ఆప్' కు తగ్గిన ఆన్ లైన్ విరాళాలు | AAP donations dip | Sakshi
Sakshi News home page

'ఆప్' కు తగ్గిన ఆన్ లైన్ విరాళాలు

Feb 13 2015 8:39 PM | Updated on Apr 4 2018 7:42 PM

'ఆప్' కు తగ్గిన ఆన్ లైన్ విరాళాలు - Sakshi

'ఆప్' కు తగ్గిన ఆన్ లైన్ విరాళాలు

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు ఆన్ లైన్ ద్వారా అందే విరాళాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు ఆన్ లైన్ ద్వారా అందే విరాళాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆప్ కు విరాళాలు తగ్గాయి. అధికారంలోకి వచ్చింది కాబట్టి 'ఆప్'కు ఇక తమ అవసరం లేదనుకున్నారో ఏమో గానీ దాతలు విరాళలు ఇవ్వడం తగ్గించారు. గత 15 రోజుల్లో 'ఆప్'కు రూ. 291,104  విరాళాలు అందాయి. అంతకుముందుతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

ఎన్నికల పోలింగ్ ముగిసిన నాటి నుంచి విరాళాలు క్రమంగా తగ్గాయి. ఎన్నికల ఫలితాల తర్వాతి రోజు రూ. 430,392 వచ్చాయి. 12న ఎంత మొత్తం అందిందనేది ఆప్' తెలపలేదు. ఇక గురువారం నాడు కేవలం రూ.80,031 విరాళాలు మాత్రమే వచ్చాయి. గతేడాది నవంబర్ 1 నుంచి ఇప్పటివరకు రూ. 18,49,87,448 విరాళాలు 'ఆప్' సేకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement