శాటిలైట్ ఫోన్లతో విదేశీయుల అరెస్టు | 84 member international group held in Jalpaiguri | Sakshi
Sakshi News home page

శాటిలైట్ ఫోన్లతో విదేశీయుల అరెస్టు

Feb 9 2014 11:33 AM | Updated on Sep 2 2017 3:31 AM

ఓ టీవీ రియాల్టీ షోలో విధ్వంసం సృష్టించడానికి యత్నించిన అంతర్జాతీయ ముఠా సభ్యుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు.

జల్పాయ్గురి:శాటిలైట్ పోన్లు కల్గి ఉన్నవిదేశీ  సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యంత అధునాతమైన శాటిలైట్ ఫోన్లతో పశ్చిమ బెంగాల్ లోని చలసా హోటల్లో దిగిన 84 మందిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 22 శాటిలైట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 33 మంది ఫ్రెంచ్ దేశస్థులు , 10 మంది బెల్జియం దేశస్థులు, ఇద్దరు నెదర్లాండ్స్ దేశస్థులు ఉండగా, ఇంగ్లండ్, జర్మనీ, స్పెయిన్ దేశాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. 

 

భారతీయ చట్టాల ప్రకారం శాటిలైట్ ఫోన్లను వాడటం నిషిద్ధం కనుకు పోలీసులకు మిలటరీ రాడార్ తో అందిన పక్కా సమాచారంతో హోటల్ పై దాడి చేసి వారిని అరెస్టు చేశారు. అయితే బెల్జియం దేశంలోని టీవీ రియల్టీ షో ను షూట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని వారు పోలీసులకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement