ఎరుపెక్కిన కెరటాలు | 8 Killed After Fishing Boat Crashes Into Ferry in Kochi | Sakshi
Sakshi News home page

ఎరుపెక్కిన కెరటాలు

Aug 26 2015 6:02 PM | Updated on Sep 3 2017 8:10 AM

ఎరుపెక్కిన కెరటాలు

ఎరుపెక్కిన కెరటాలు

కొచి ఫోర్ట్ తీరంలో ఓ ప్రయాణికుల నౌనకు.. చేపల పడవ ఢీకొట్టడంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు.

- కొచి ఫోర్ట్ తీరంలో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం

కొచి:
కేరళలోని కొచి ఫోర్ట్ తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బుధవారం మద్యాహ్నం ఓ ప్రయాణికుల నౌనకు.. చేపల పడవ ఢీకొట్టడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వైపిన్ ద్వీపం నుంచి కొచి పోర్ట్ తీరానికి బయలుదేరిన నౌకలో 30 మంది ప్రయాణిస్తున్నారు. కొద్ది సేపట్లో తీరానికి చేరుకుంటుందనగా.. చేపల వేటకు ఉపయోగించే పడవ ఒకటి వేగంగా దూసుకొచ్చి నౌకను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోగా, 20 మంది గాయాలతో బయటపడ్డారు. తీర రక్షక దళం, నౌకా దౌళం, స్థానిక పోలీసులు, జాలర్లు కలిసికట్టుగా క్షతగాత్రులను కాపాడారు. రెస్యూ ఆపరేషన్లో గజ ఈతగాళ్లతోపాటు చేతక్ హెలికాప్టర్ ను కూడా వినియోగించినట్లు నౌకాదళం ప్రతినిధులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement