నైజీరియాలోని కనో రాష్ట్రంలో కలరా విజృంభించి ఏకంగా 71 మంది ప్రాణాలు బలిగొంది. గడిచిన రెండు నెలల్లో ఏకంగా 2,165 కలరా కేసులు నమోదైనట్లు నైజారియాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రాజెక్టు డైరెక్టర్ అబ్దుల్ సలాం నసీదీ తెలిపారు.

కలరా మరింత ఎక్కువగా వ్యాపించకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం ఓ వైద్య బృందాన్ని మందులతో సహా ఆ రాష్ట్రానికి పంపించింది. కలరా రావడంతో ఆ ప్రాంతంలోని బాధితులంతా విపరీతమైన వాంతులు, డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. వీరికి సరైన చికిత్స సకాలంలో అందకపోతే మరణాలు మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. గతంలోనూ మీజిల్స్, మెదడువాపు లాంటి వ్యాధులు నైజీరియాలో తీవ్రంగా వ్యాపించాయి.