71 మంది ఐఎస్ తీవ్రవాదులు హతం | 71 IS militants killed in Iraq | Sakshi
Sakshi News home page

71 మంది ఐఎస్ తీవ్రవాదులు హతం

May 26 2015 8:36 AM | Updated on Apr 4 2019 5:12 PM

ఇరాక్ ఉత్తర ప్రాంతం మసూల్ పరిసర ప్రాంతాలల్లో ఐఎస్ తీవ్రవాదులే లక్ష్యంగా యూఎస్ సారధ్యంలోని అంతర్జాతీయ సంకీర్ణ దళాలు సోమవారం వైమానిక దాడులు నిర్వహించాయి.

బాగ్దాద్: ఇరాక్ ఉత్తర ప్రాంతం మసూల్ పరిసర ప్రాంతాలల్లో ఐఎస్ తీవ్రవాదులే లక్ష్యంగా యూఎస్ సారధ్యంలోని అంతర్జాతీయ సంకీర్ణ దళాలు సోమవారం వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో దాదాపు 40 మందికి పైగా ఐఎస్ తీవ్రవాదులు మరణించారు. మృతుల్లో ముగ్గురు ఐఎస్ తీవ్రవాద నాయకులు ఉన్నారని.. వారు మజ్బల్ దిబాన్ ఖాలప్, అహ్మద్ అలీ అల్ జుబొరి, బాస్మీ మహమ్మద్ అలీగా గుర్తించినట్లు ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు.

అయితే మసూల్లోని దక్షిణ ప్రాంతంలో కూడా వైమానిక దాడుల్లో మరో 31 మంది ఐఎస్ తీవ్రవాదులు మరణించారని తెలిపారు. దాంతో సోమవారం ఒక్కరోజే మరణించిన ఐఎస్ తీవ్రవాదుల సంఖ్య 71కి చేరిందని ఉన్నతాధికారి వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement