మెక్సికోను కుదిపేసిన భారీ భూకంపం! | 6.2 magnitude quake jolts Mexico | Sakshi
Sakshi News home page

మెక్సికోను కుదిపేసిన భారీ భూకంపం!

Oct 8 2014 2:07 PM | Updated on Sep 2 2017 2:32 PM

మెక్సికో నగరాన్ని శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

మెక్సికో సిటి: మెక్సికో నగరాన్ని శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మెక్సికోలోని నైరుతి ఎల్ డొరాడో ప్రాంతానికి 121 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు అందుబాటులోకి రాలేదు. భూకంప తీవ్రత ప్రభావానికి భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయని మీడియా వెల్లడిస్తోంది. విద్యుత్ అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement