అమెరికాలో కాల్పులు: ముగ్గురు వ్యక్తులు మృతి | 3 killed, 2 wounded in shooting at US strip club Irvington | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు: ముగ్గురు వ్యక్తులు మృతి

Dec 26 2013 9:23 AM | Updated on Apr 4 2019 5:12 PM

న్యూజెర్సీ ఇర్వింగ్టన్లో ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో విషాదం చోటు చేసుకుంది.

న్యూజెర్సీ ఇర్వింగ్టన్లో ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో విషాదం చోటు చేసుకుంది. ఇర్వింగ్టన్లోని ఓ క్లబ్లో ఆగంతకుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో క్లబ్ యజమాని కుమారుడితోపాటు ఉద్యోగి కూడా ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోకరని గుర్తించవలసి ఉందని తెలిపారు.

 

తుపాకితో పాటు క్లబ్లోకి ప్రవేశించేందుకు యత్నించిన వ్యక్తిని క్లబ్ భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో ఆ వ్యక్తి ఆగ్రహంతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాల్పులు జరిపిన ఆగంతకుడిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు గురువారం వివరించారు. గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement