
చైనాలో కుప్పకూలిన భారీ భవనం
చైనా ఓ భారీ భవన సముదాయం కూలిపోయి 21 మంది ఆచూకీ తెలియడం లేదు. వారంతా శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నారా లేరా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
బీజింగ్: చైనా ఓ భారీ భవన సముదాయం కూలిపోయి 21 మంది ఆచూకీ తెలియడం లేదు. వారంతా శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నారా లేరా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. గిజౌ ప్రావిన్స్ రాజధాని ప్రాంతమైన గియాంగ్లో ఓ తొమ్మిది అంతస్తుల భవనం బుధవారం ఉదయం 11.30గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మొత్తం 114 మంది ఇందులో నివాసం ఉంటుండగా వారిలో 21 మంది జాడ తెలియడంలేదని ప్రభుత్వాధికారులు తెలిపారు. భారీ వర్షం కురుస్తున్న కారణంగానే భవనం కూలిపోయిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇదిలా ఉండగా, ఈ భవనం గ్రౌండ్ ప్లోర్లో ఉంటున్న వ్యక్తిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు.