స్వదేశానికి మరో 200 మంది భారతీయులు | 200 more Indians from Iraq return | Sakshi
Sakshi News home page

స్వదేశానికి మరో 200 మంది భారతీయులు

Jul 6 2014 8:44 AM | Updated on Jul 11 2019 8:48 PM

ఇరాక్ నుంచి మరో 200 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.

న్యూఢిల్లీ: ఇరాక్ నుంచి మరో 200 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఇరాక్ ఎయిర్వేస్కు చెందిన ప్రత్యేక విమానంలో ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు ఢిల్లీకి వచ్చారు. ఇరాక్ లోని సంక్షుభిత నజాఫ్ ప్రాంతం నుంచి వీరిని ఇక్కడకు తరలించారు.

వచ్చే రెండు రోజుల్లో 600 మందిని ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తరలించనున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం నాటికి దాదాపు 1200 మంది భారతీయులు ప్రభుత్వ ఖర్చులపై భారత్ చేరుకుంటారని వెల్లడించింది. ఇరాక్‌లో గత నెల రోజులుగా తీవ్ర భయాందోళనల మధ్య, క్షణమొక యుగంగా మత్యుభయంతో గడిపిన 183 మంది భారతీయులు  శనివారం క్షేమంగా తిరిగి వచ్చారు. మళ్లీ ఇరాక్ వెళ్లబోమని వారు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement