'బ్లాక్ మెయిల్' కేసులో ఇద్దరు మహిళలు సరెండర్ | 2 women suspects in blackmail case brought to Thiruvananthapuram | Sakshi
Sakshi News home page

'బ్లాక్ మెయిల్' కేసులో ఇద్దరు మహిళలు సరెండర్

Aug 3 2014 7:36 PM | Updated on Sep 2 2017 11:19 AM

బ్లాక్ మెయిల్ సెక్స్ స్కామ్' కు సంబంధించి ఇద్దరు మహిళలు పోలీసులకు లొంగిపోయారు

తిరువనంతపురం:'బ్లాక్ మెయిల్ సెక్స్ స్కామ్' కు సంబంధించి ఇద్దరు మహిళలు పోలీసులకు లొంగిపోయారు  పలువురి వ్యక్తులను శృంగార ముగ్గులోకి దింపి ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠాలోని ఇద్దరు మహిళలు శనివారం రాత్రి పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఈ ముఠా బారిన పడి ఓ వ్యాపారవేత్త గత నెల్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. పలువురు ప్రముఖ వ్యక్తులు, వ్యాపార వేత్తలతోపాటు, రాజకీయ నేతలకు ఎరవేసి వారి నుంచి డబ్బులు గుంజడమే ఈ సెక్స్ రాకెట్ ముఠా ప్రధాన టార్గెట్. 

 

వారి బారిన పడ్డ బాధితుల చిత్రాలను వీడియోల్లో బంధించి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడటంతో అది కాస్తా కేరళ పోలీసులకు తలనొప్పిగా మారింది. వీరు నిన్న స్వయంగా తమ న్యాయవాదిని వెంటతీసుకుని మహిళా పోలీస్ స్టేషన్ ఎదుట లొంగిపోయారు.ప్రస్తుతం ఆ మహిళలను విచారిస్తున్న పోలీస్ అధికారులు ఆ ముఠా వెనుక సభ్యులకు సంబంధించి ఆధారాలు రాబట్టే పనిలో పడ్డారు.  వీరిని సోమవారం కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement