ఉగ్రవాదులనుకొని చితక్కొట్టారు | 2 Teens Allegedly Beaten Up By Mumbai Police Over Suspicion of IS Links | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులనుకొని చితక్కొట్టారు

Oct 19 2015 8:29 AM | Updated on Sep 3 2017 11:12 AM

ఉగ్రవాదులనుకొని చితక్కొట్టారు

ఉగ్రవాదులనుకొని చితక్కొట్టారు

ఉగ్రవాదులనుకొని ముంబయి పోలీసులు ఇద్దరు ముస్లిం యువకులను చితక్కొట్టారు. అనంతరం ఎలాంటి ఫిర్యాదు నమోదుచేయకుండా విడిచేందుకు డబ్బులు డిమాండ్ చేశారు.

ముంబయి: ఉగ్రవాదులనుకొని ముంబయి పోలీసులు ఇద్దరు ముస్లిం యువకులను చితక్కొట్టారు. అనంతరం ఎలాంటి ఫిర్యాదు నమోదుచేయకుండా విడిచేందుకు డబ్బులు డిమాండ్ చేశారు.గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసిఫ్ షేక్, డానిష్ షేక్ అనే 19 ఏళ్ల కుర్రాళ్లు గత శుక్రవారం రాత్రి ఓ తాగిన మైకంలో ఉన్న వ్యక్తికి సాయం చేస్తూ అతడిని రోడ్డు దాటిస్తుండగా పోలీసులు వారి దగ్గరకు వచ్చారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులనుకొని లేదా ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనుకొని భావించి వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ రాత్రంతా చితక్కొట్టారు.

తమకు ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదని వాపోవడంతో అయితే కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీసం తల్లిదండ్రులకు సమాచారం అందించే అవకాశం కూడా ఇవ్వలేదు. చివరికీ ఈ విషయం వారి తల్లి దండ్రులకు తెలిసి భగ్గుమన్నారు. తప్పు చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, దీనిపై అధికారికంగా స్పందించని పోలీసులు మాత్రం ఘటనపై విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement