28లోగా దేశం విడిచి వెళ్లిపోండి | Mumbai Police has issued notice to actor Imran Khan to leave India by 28 Oct | Sakshi
Sakshi News home page

28లోగా దేశం విడిచి వెళ్లిపోండి

Oct 16 2026 4:11 AM | Updated on Oct 16 2026 4:11 AM

Mumbai Police has issued notice to actor Imran Khan to leave India by 28 Oct

నటుడు ఇమ్రాన్‌ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసు 

ముంబై: ఈ నెల 28వ తేదీలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని అమెరికా పౌరుడు, బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌(43)కు ముంబై పోలీసులు నోటీసు జారీ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ దిగిపోవాలనే డిమాండ్‌తో ఈ నెల 10వ తేదీన ముంబైలోని ఆగస్ట్‌ క్రాంతి మైదాన్‌లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఇమ్రాన్‌ ఖాన్‌ పాలుపంచుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. నిరసనలో పాల్గొన్న ఇమ్రాన్‌ను పోలీసులు కొద్దిసేపు నిర్బంధంలో ఉంచారు. అయితే, ఇమ్రాన్‌ వలస, విదేశీయుల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించారని ముంబై పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు.

విదేశీ పౌరులు మన దేశంలో రాజకీయ కార్యకలాపాలు, రాజకీయ నిరసల్లో పాల్గొనడాన్ని ఇమిగ్రేషన్‌ చట్టం నిషేధించిందని పోలీసులు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ మేనల్లుడైన ఇమ్రాన్‌ పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించారు. పోలీసుల నోటీసుపై ఇమ్రాన్‌ లాయర్‌ జుల్పికర్‌ మెమన్‌ స్పందించారు. శుక్రవారం లేదా సోమవారం పోలీసుల నోటీసును సవాల్‌ చేస్తూ ముంబై హైకోర్టులో పిటిషన్‌ వేయనున్నట్లు చెప్పారు. ఇమ్రాన్‌ ఖాన్‌కు ఓవర్సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ) కార్డుందని తెలిపారు. ఓసీఐ కార్డుదారులు శాంతియుతంగా జరిగే నిరసనల్లో పాల్గొనరాదని ఎలాంటి నిబంధనలు లేవని, చట్టం నిషేధించలేదని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement