కారుపై మృతదేహం.. 15 కి.మీ. ప్రయాణం..! | 15 km away from dead body of car Travel | Sakshi
Sakshi News home page

కారుపై మృతదేహం.. 15 కి.మీ. ప్రయాణం..!

Jan 3 2016 3:31 AM | Updated on Aug 21 2018 5:52 PM

కారుపై మృతదేహం.. 15 కి.మీ. ప్రయాణం..! - Sakshi

కారుపై మృతదేహం.. 15 కి.మీ. ప్రయాణం..!

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద శనివారం రోడ్డు దాటుతున్న వృద్ధుడు కొమిరెల్లి వెంకట్‌రెడ్డి(65)ని హైదరాబాద్

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి  జంక్షన్ వద్ద శనివారం రోడ్డు దాటుతున్న వృద్ధుడు కొమిరెల్లి వెంకట్‌రెడ్డి(65)ని హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్‌రెడ్డి అమాంతం గాల్లోకి ఎగిరి అదే కారుపై పడి మృతి చెందాడు. కానీ, కారు డ్రైవర్ రహీంఖాన్ మాత్రం ఆ వాహనాన్ని ఆపకుండా 15 కిలోమీటర్ల దూరం అలాగే కారుపై మృతదేహంతోనే వెళ్లాడు. వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపుడే అయిటిపాముల వద్ద కారు రిపేర్‌తో ఆగిపోగా పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.    
             - నార్కట్‌పల్లి

Advertisement
 
Advertisement
Advertisement