ఇస్లామిక్ స్టేట్లోకి 13 మంది భారతీయులు! | 13 indians joined is, only 7 of them alive, says home ministry | Sakshi
Sakshi News home page

ఇస్లామిక్ స్టేట్లోకి 13 మంది భారతీయులు!

Aug 3 2015 8:24 PM | Updated on Sep 3 2017 6:43 AM

ఇస్లామిక్ స్టేట్లోకి 13 మంది భారతీయులు!

ఇస్లామిక్ స్టేట్లోకి 13 మంది భారతీయులు!

గడిచిన ఏడాదిన్నర కాలంలో 13 మంది భారతీయులు విదేశాలకు వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరారు.

గడిచిన ఏడాదిన్నర కాలంలో 13 మంది భారతీయులు విదేశాలకు వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరారు. వాళ్లలో ఇప్పటికి ఆరుగురు మరణించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బతికున్నవాళ్లలో ఒక్కరు మాత్రమే పోరాటంలో ఉన్నారని, మిగలినవాళ్లు వంటవాళ్లు గాను, డ్రైవర్లు గాను, హెల్పర్లు గాను పనిచేస్తున్నారని హోం మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన నలుగురు యువకుల బృందంలోని ఇద్దరు గత మే నెలలో దేశాన్ని వదిలి వెళ్లి ఇస్లామిక్ స్టేట్లో చేరారు. మరో ముగ్గురు ఆస్ట్రేలియా, ఒమన్, సింగపూర్ దేశాల నుంచి అక్కడకు వెళ్లారు. వీళ్లంతా ప్రస్తుతం అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు. పెరుగుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ముప్పుపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాల అధికారులతో ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని త్వరలో నిర్వహించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement