బార్లో ఆత్మాహుతి దాడి: 12 మంది మృతి | 12 killed in suicide bomb blast in Cameroon | Sakshi
Sakshi News home page

బార్లో ఆత్మాహుతి దాడి: 12 మంది మృతి

Jul 26 2015 9:04 AM | Updated on Nov 6 2018 8:35 PM

బార్లో ఆత్మాహుతి దాడి: 12 మంది మృతి - Sakshi

బార్లో ఆత్మాహుతి దాడి: 12 మంది మృతి

సెంట్రల్ ఆఫ్రికా దేశం కెమరూన్లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కెమరూన్లోని మరౌవ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు.

కెమరూన్ : సెంట్రల్ ఆఫ్రికా దేశం కెమరూన్లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కెమరూన్లోని మరౌవ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారని మీడియా ఆదివారం వెల్లడించింది. మహిళ తన నడుమకు బాంబు అమర్చుకుని బార్లోకి ప్రవేశించిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని తెలిపింది. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. అయితే ఇదే ప్రాంతంలో గత బుధవారం జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 20 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement