11 గంటలు@ వందేళ్లు | 11 hours @ Hundred years | Sakshi
Sakshi News home page

11 గంటలు@ వందేళ్లు

Oct 22 2015 2:04 AM | Updated on Sep 3 2017 11:18 AM

11 గంటలు@ వందేళ్లు

11 గంటలు@ వందేళ్లు

వృత్తిజీవితంలో ఎన్నో ఏళ్లు పనిచేశాం. ఇక విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంటున్నారా? అలాంటి వారు ఈ బామ్మ

న్యూయార్క్: వృత్తిజీవితంలో ఎన్నో ఏళ్లు పనిచేశాం. ఇక  విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంటున్నారా? అలాంటి వారు ఈ బామ్మ తెలుసుకోవాల్సిందే. వందేళ్లు దాటినా చలాకీగా ఉండే ఈ బామ్మ పేరు ఫెలిమినా రొటుండే. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈవిడ తన వందో పుట్టినరోజు జరుపుకుంది. 50 ఏళ్లు పూర్తయిన వాళ్లలో చాలా మంది రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ, ఈ బామ్మ శతాయుష్షులోనూ పనిచేస్తోంది. అమెరికాలోని బఫెలో నగరంలోని ఓ లాండ్రీ షాపులో పనిచేస్తోంది.

పని అంటే అల్లాటప్పా పని కాదు. రోజుకు ఏకబిగిన 11 గంటల పని. బట్టలు ఉతకడం, డ్రైక్లీనింగ్ పనులు బామ్మ చకచక చేసేస్తుంది. ఉదయం ఏడుగంటలకు పని మొదలుపెడితే సాయంత్రంఆరింటికి ముగుస్తుంది. ‘15 ఏళ్లప్పుడు పనిలో చేరా. నా ఉద్దేశంలో అనారోగ్యం వస్తేనే 75ఏళ్లకు రిటైర్ కావాలి. ఆరోగ్యంగా ఉంటే జీవితాంతం పనిచేస్తూ ఉండాలి’ అంటోంది బామ్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement