బెలూచిస్థాన్లో 10 మంది తీవ్రవాదులు హతం | 10 militants killed in Balochistan | Sakshi
Sakshi News home page

బెలూచిస్థాన్లో 10 మంది తీవ్రవాదులు హతం

Sep 1 2013 8:28 AM | Updated on Sep 1 2017 10:21 PM

పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లో భద్రతాదళాలు శనివారం జరిపిన కాల్పుల్లో 10 మంది తీవ్రవాదులు మరణించారని స్థానిక మీడియా ఆదివారం ఇక్కడ వెల్లడించింది.

పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లో భద్రతాదళాలు శనివారం జరిపిన కాల్పుల్లో 10 మంది తీవ్రవాదులు మరణించారని స్థానిక మీడియా ఆదివారం ఇక్కడ వెల్లడించింది. మండ్ నగర ప్రాంతంలో జరిగిన ఆ ఘటనలో పలు తీవ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. కాల్పులు జరిగిన సంఘటన స్థలంలో అధిక మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే భద్రతదళాల వైపు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని మీడియా తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement