అమరావతిలో అందాల రాక్షసి | Lavanya Tripati Visit Vijayawada | Sakshi
Sakshi News home page

అమరావతిలో అందాల రాక్షసి

Apr 7 2018 8:15 AM | Updated on Apr 7 2018 8:15 AM

Lavanya Tripati Visit Vijayawada - Sakshi

అందాల రాకాసిగా కుర్రోళ్ల గుండెల్లో కొలువుదీరావు. భలే భలే మగాడివోయ్‌ అంటూ రంజింపజేశావు. అయోధ్య నుంచి వచ్చినా ఆంధ్రుల మతి చెడగొట్టావు..అంతులేని ‘లావణ్య’ం నీది.. అంటూ శుక్రవారం విజయవాడలో యువత హీరోయిన్‌ లావణ్య త్రిపాఠికి అభిమాన నీరాజనం పలికారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు) :  భలే భలే..భలే భలే మగాడివోయ్‌..అంటూ యువతరాన్ని తన ‘లావణ్య’ంతో మత్తెక్తించిన అందాల రాకాసి నవ్యాంధ్రలో సందడి చేసింది. తమ అభిమాన నటి నగరానికి వచ్చిందని తెలుసుకున్న అభిమానులు భారీగా తరలివచ్చారు. బెంజిసర్కిల్‌ సమీపంలో లాట్‌ మొబైల్‌ 161వ షోరూమ్‌ను హీరోయిన్‌ లావణ్యత్రిపాఠి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ అభిమానులు తనను ఇంతగా ఆదరించడం సంతోషించదగిన విషయంగా పేర్కొన్నారు. లాట్‌ మొబైల్స్‌లో విభిన్న రకాల మోడళ్లతో పాటు ప్రజల కోసం వివిధ ఆఫర్లు ప్రకటించడం అభినందనీయమన్నారు. లాట్‌ మొబైల్స్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ టి.రావేష్‌ తమీరా మాట్లాడుతూ తమ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా లక్కీ డ్రా ఏర్పాటు చేశామని, నాలు వారాల పాటు డ్రా తీసి గెలుపొందిన వారికి టీవీ, వాషింగ్‌ మెషిన్, ఫ్రిజ్‌లు బముమతులుగా అందజేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement