జీవితంపై విరక్తితో ఆత్మహత్య | young man suicide | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తితో ఆత్మహత్య

Mar 9 2017 8:16 PM | Updated on Nov 6 2018 7:53 PM

జీవితంపై విరక్తితో ఓ యువకుడు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యచేసుకున్నాడు.

ఘట్‌కేసర్‌: జీవితంపై విరక్తితో ఓ యువకుడు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యచేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన కోటరీ నాగరాజు (32) ప్రైవేట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 6న భువనగిరి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాడు. ఘట్‌కేసర్‌ సమీపంలోనికి రాగనే తన సోదరుడు మల్లికార్జున్‌కు ఫోన్‌చేసి తాను పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం అందచేశాడు. అతను సంఘటన స్థలం వచ్చేసరికి నిప్పుపెట్టుకొన్నాడు. వెంటనే 108 అంబులెన్సుకు సమాచారం అందచేశారు. నాగరాజును చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం నాగరాజు మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement