యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం | Yoga Good For Health Says Baba Ramdev | Sakshi
Sakshi News home page

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

Published Thu, Jan 30 2020 2:27 AM | Last Updated on Thu, Jan 30 2020 2:34 AM

Yoga Good For Health Says Baba Ramdev - Sakshi

నందిగామ (షాద్‌నగర్‌): ధ్యానం, యోగాతోనే మానసిక ప్రశాంతత, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని యోగా గురు బాబా రాందేవ్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కాన్హా శాంతివనంలో హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్, శ్రీ రామచంద్ర మిషన్‌ వార్షికోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాలకు ఆయన మంగళవారం హాజరై రాత్రి అక్కడే బస చేశారు. వార్షికోత్సవంలో రెండోరోజైన బుధవారం ఉదయం జరిగిన ధ్యాన కార్యక్రమంలో గురూజీ కమ్లేష్‌ డీ పటేల్‌(దాజీ)తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాబా దేవ్‌ మాట్లాడుతూ..ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధ్యానంతో పాటు యోగా సాధన చేయాలని, అప్పుడే సమాజం బాగుంటుందన్నారు. అనం తరం ఆశ్రమంలో మొక్కను నాటి, రోడ్డును ప్రారంభించారు. ఈ రోడ్డుకు యోగర్షి స్వామీ రాందేవ్‌ మార్గ్‌గా నామకరణం చేశారు. ఈ ధ్యాన వేడుకలకు 2వరోజు  40వేల మంది హాజరైనట్లు నిర్వహకులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement